- Telugu News Photo Gallery Technology photos According to latest reports Apple going to launch its first foldable smartphone by 2027
Apple: యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చేస్తున్నాయ్.. అందుబాటులోకి ఎప్పుడు రానుందంటే
ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ హవా నడుస్తోంది. ఇప్పటికే సామ్‌సంగ్ సహా వివో, హువాయితో పాటు పలు ప్రముఖ కంపెనీలు మార్కెట్లోకి ఫోల్డబుల్ ఫోన్స్‌ను లాంచ్ చేశాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ రంగంలోకి ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ సైతం ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
Updated on: Feb 04, 2024 | 10:15 PM

మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ హవా నడుస్తోన్న సమయంలో యాపిల్ ఫోన్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా చైనా మార్కెట్లో హవాయ్ ఫోల్డబుల్ ఫోన్ల కారణంగా యాపిల్ అమ్మకాలు క్షీణించాయి. అలాగే ఇతర కంపెనీల నుంచి కూడా పోటీ పెరుగుతోన్న నేపథ్యంలో యాపిల్ సైతం ఈ రంగంలోకి అడుగుపెడుతోంది.

ఇతర కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు గాను యాపిల్ సైతం ఫోల్డబుల్ ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే మార్కెట్లోకి యాపిల్ ఫోల్డబుల్ ఫోన్స్ రానున్నాయి. అయితే దీనిపై యాపిల్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.

అయితే నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం యాపిల్ 7.6 నుంచి 8.4 ఇంచెస్ మధ్య భారీ డిస్‌ప్లేను స్మార్ట్ ఫోన్‌ను తయారు చేస్తోందని తెలుస్తోంది. ది ఎలెక్ నివేదిక ప్రకారం యాపిల్ నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ 2026 లేదా 2027 నాటికి అందుబాటులోకి రావచ్చని చెబుతోంది.

ఇక ఐపాడ్ మినిని ఫోల్డబుల్ మోడల్‌లో విడుదల చేయడానికి యాపిల్ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తుల వస్తున్నాయి. ఇందులో 8.3 ఇంచెస్‌తో కూడిన లిక్విడ్ రెటినా IPS LCD స్క్రీన్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

యాపిల్ ఫోల్డబుల్ ఫోన్స్‌ను ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తసమాచారం. యాపిల్‌కు ఎక్కువ ఆదాయం వచ్చే చైనా మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ నుంచి పోటీ నెలకొన్ నేపథ్యంలోనే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.




