- Telugu News Photo Gallery Pumpkin side effects: these peoples should not eat pumpkin even by mistake know its disadvantages
గుమ్మడికాయ మంచిదే.. కానీ, ఈ వ్యక్తులు మాత్రం పొరపాటున కూడా తినకూడదంట..
గుమ్మడికాయలో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి.. గుమ్మడికాయ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పోషకాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.. అందుకే వైద్య నిపుణులు తినాలని సూచిస్తుంటారు. గుమ్మడి విత్తనాలలో కూడా ఎన్నో పోషకాలు దాగున్నాయి.
Updated on: May 23, 2024 | 11:19 AM

గుమ్మడికాయలో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి.. గుమ్మడికాయ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పోషకాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.. అందుకే వైద్య నిపుణులు తినాలని సూచిస్తుంటారు. గుమ్మడి తోపాటు దాని విత్తనాలలో కూడా ఎన్నో పోషకాలు దాగున్నాయి.

గుమ్మడికాయలో జింక్, విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్, విటమిన్లు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా.. ఇందులో 96శాతం నీరు కూడా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌తోపాటు.. పలు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

గుమ్మడికాయను కూరగాయలుగా వండుకుని తింటారు.. అంతేకాకుండా గుమ్మడికాయను.. సాంబారు, హల్వా, పప్పు, పులుసు ఇలా డిఫెరెంట్ స్టైల్ లో వండుకొని తింటారు. దీని వంట చాలా రుచికరంగా ఉంటుంది.

అయితే.. ఆరోగ్యానికి మేలు చేసే గుమ్మడికాయ.. కొంతమంది తీసుకోవడం వల్ల హాని కలుగుతుంది. కొన్ని సమస్యలున్న వారు గుమ్మడికాయను తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ ఎసిడిటీ సమస్య ఉన్నవారు గుమ్మడికాయ తినకూడదు.

డయాబెటిక్ పేషెంట్ అయితే గుమ్మడికాయ తినకుండా ఉండాలి. గుమ్మడికాయ అధిక GI ని కలిగి ఉంది. ఇది డయాబెటీస్ పేషెంట్స్‌కి మంచిది కాదు. దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతుంది.

గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే స్త్రీలు గుమ్మడికాయ తినడం మానుకోవాలి. అధిక మొత్తంలో తీసుకుంటే.. అలెర్జీ లాంటివి వస్తాయి.. దీంతో పాటు తలనొప్పి, విరేచనాలు, కడుపు సమస్యలు లాంటివి కూడా వచ్చే ప్రమాదముంది.




