- Telugu News Photo Gallery Technology photos Amazon offering huge discount on POCO C65 smart phone, Check here for features and price details
POCO C65: రూ. 7 వేలకే 50 మెగాపిక్సెల్ కెమెరా.. పోకో ఫోన్‌పై భారీ డిస్కౌంట్
సీజన్‌తో సంబంధం లేకుండా ఈ కామర్స్ సంస్థలు స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. మొన్నటి వరకు సమ్మర్ సేల్‌లో స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సేల్ తర్వాత కూడా అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్స్‌పై డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే పోకోసీ65 స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు ధర లభిస్తోంది. ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి.? ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 23, 2024 | 10:52 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో కంపెనీకి చెందిన పోకో సీ65 స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 11,999గా ఉండగా, అమెజాన్‌లో38 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 7,499కే సొంతం చేసుకోవవచ్చు.

దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 500 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 7వేలకే సొంతం చేసుకోవచ్చు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. అదే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్మార్ట్ ఫోన్‌ను డిస్కౌంట్‌తో రూ. 6,300కే సొంతం చేసుకోవచ్చు.

పోకో సీ65 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన మాక్రో కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 18 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్ ఇంటర్నలర్ మెమోరీని ఎస్‌డీ కార్డు సహాయంతో 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. బ్లూటూత్, వైఫై, యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.




