షామ్లీ జిల్లాలోని కైరానా అసెంబ్లీ స్థానం నుంచి అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక్కడి నుంచి మాజీ ఎంపీ హుకుమ్ సింగ్ కుమార్తె మృగాంక సింగ్‌కు బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. మతపరమైన ఉద్రిక్తత కారణంగా, ఇక్కడి హిందువులు తమ ఇళ్లను అమ్మి వలస వెళ్లవలసి వచ్చిందని ఆమిత్ షా ఆరోపించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కైరానా నుంచి వలసలు పెద్ద సమస్యగా మారాయి. వలస వెళ్లిన వారు తిరిగి వచ్చేలా చేస్తామన్నారు అమిత్ షా.