Sanjay Kasula |
Updated on: Mar 07, 2023 | 9:02 PM
గౌహతి మీదుగా మూడు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌లను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.
మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలలో బిజెపి మద్దతు ఉన్న సంకీర్ణాలు అధికారాన్ని దక్కించుకున్నాయి. గౌహతిలో స్థానికుల నుంచి భారీ స్వాగతం లభించింది.
మంగళవారం గౌహతి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అస్సాం ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రజలు ప్రధాని కారుపై రంగులు, పూల వర్షం కురిపించారు.
ప్రధాని మోదీని చూసేందుకు జనం పెద్దఎత్తున చేరుకున్నారు. ప్రధాని మోదీ కారుపై మహిళలు పూల వర్షం కురిపించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ అసోం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి భారీ స్వాగతం పలికారు. "నమో.." అంటూ మారుమోగిన గౌహతి వీధులు మారుమ్రోగాయి..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ తన రెండు రోజుల ఈశాన్య పర్యటనను మొదలు పెట్టారు. అక్కడ మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌లలో ప్రమాణ స్వీకారోత్సవాలకు హాజరవుతారు. అస్సాం మంత్రివర్గం సభ్యులతో సమావేశం నిర్వహిస్తారు.
స్థానిక మహిళల నుంచి ఘన స్వాగతం లభించింది. దారి పొడువునా మోదీ.. మోదీ అంటూ మారుమ్రోగాయి..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారోత్సవాలకు హాజరయ్యేందుకు మేఘాలయ, నాగాలాండ్‌లకు వెళ్లే ముందు ప్రధాని మోదీ ఉదయం గౌహతిలో దిగారు.
లోక్‌ప్రియా గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి అస్సాం గవర్నర్‌గా నియమితులైన గులాబ్ చంద్ కటారియా స్వాగతం పలికారు .