CM KCR Birthday: ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు… చిన్నారికి కేసీఆర్ పేరు పెట్టి.. అభిమానం చాటుకున్న దంపతులు
CM KCR Birthday Celebrations: తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
Updated on: Feb 17, 2022 | 2:59 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తమ కుమారునికి కేసీఆర్ గా నామకరణం చేసిన దంపతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా ( కె ) గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గ్రామంలో నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా భాగ్యశ్రీ, చంద్రకాంత్ అనే దంపతులు తమ కొడుకుకి కేసీఆర్ పేరును నామకరణం చేశారు.

కేసీఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా దళిత బస్తిలో మూడెకరాల భూమి, రైతుబంధు సాయం అందిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఆ దంపతులు. అంతేకాదు కేసీఆర్ దయతోనే మా కుటుంబం చల్లగా ఉందని దంపతులు చెప్పారు. ఘనంగా నిర్వహించిన సీఎం పుట్టిన రోజు సంబురాల్లో పాల్గొన్న ముఖరా కే గ్రామస్తులు పాల్గొన్నారు.

కేసీఆర్ పై అభిమానం చాటుకున్న దంపతుల చిన్నారికి కేసీఆర్ పేరు (Photos Coutesy: Naresh, Adilabad Dist, TV9)
