- Telugu News Photo Gallery PM Modi visits Delhi’s Sacred Heart Cathedral Catholic Church on Easter, First Such Visit By A Prime Minister
PM Modi Church Visit: ఈస్టర్ సందర్భంగా సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ క్యాథలిక్ చర్చిని సందర్శించిన ప్రధాని మోదీ..
ప్రధాని మోదీ ఢిల్లీలో ఈస్టర్ వేడుకలకు హాజరయ్యారు. సాక్రియేటెడ్ హార్ట్ క్యాథలిక్ చర్చిని సందర్శించారు ప్రధాని మోదీ. క్రీస్తు బోధనలు అందరికి ఆదర్శమని అన్నారు ప్రధాని మోదీ. క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో ఈ చర్చిని మోదీ సందర్శించడం తొలిసారి అని తెలిపారు ఫాదర్ ఫ్రాన్సిస్ స్వామినాథన్.
Updated on: Apr 09, 2023 | 7:38 PM

క్రైస్తవుల పండుగ ఈస్టర్ సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 9) ఢిల్లీలోని పెద్ద చర్చిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ క్యాథలిక్ చర్చికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ ఆయనకు స్వాగతం లభించింది.

ప్రధాని మోదీ చర్చికి చేరుకోగానే ప్రీయిస్టులు ఆయనకు శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

ఈస్టర్ సందర్భంగా చర్చికి వచ్చిన ప్రధాని మోదీ యేసు ప్రభుద్వు ప్రతిమ ముందు క్యాండిల్ వెలిగించారు.

చర్చిలో చిన్నారులు ప్రార్థన గీతాలను ఆలపించారు. ఈ సమయంలో, చర్చిలో సాధారణ ప్రజలు కూడా ఉన్నారు. ప్రధాని మోదీ ప్రశాంతమైన భంగిమలో యేసుక్రీస్తుకు చేసిన ప్రార్థనలను విన్నారు.

చర్చి తరపున ప్రధాని మోదీకి యేసు ప్రభువు జ్ఞాపికను కూడా అందజేశారు. చివరగా, పూజారులు, పిల్లలు ప్రధాని మోదీతో ఫోటోలు దిగారు. తనకు గుర్తున్నంత వరకు ఈ చర్చికి ప్రధాని రావడం ఇదే తొలిసారి అని అన్నారు.

చర్చి ముందు ఉన్న గార్డెన్‌లో ప్రధాన ప్రీయిస్టులతో కలిసి కొబ్బరి మొక్కను నాటారు ప్రధాని మోదీ..

అనంతరం చర్చిలో ఉన్న సామాన్య ప్రజల శుభాకాంక్షలు స్వీకరిస్తూ ప్రధాని మోదీ బయటకు వచ్చారు. ప్రధాని మోదీతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. వారందరితో కలిసి చర్చి ముందు ఫోటో దిగారు ప్రధాని మోదీ.

చివరగా, పూజారులు, పిల్లలు ప్రధాని మోదీతో ఫోటోలు దిగారు. అనంతరం చర్చిలో ఉన్న సామాన్య ప్రజల శుభాకాంక్షలు స్వీకరిస్తూ ప్రధాని మోదీ బయటకు వచ్చారు.




