- Telugu News Photo Gallery People of these zodiac signs will get rid of debts due to the influence of Jupiter
అప్పులున్న వారికి ఆనంద సమయం.. ఎందుకంటే?
గురు గ్రహం అన్ని గ్రహాల్లో కెళ్ల చాలా శక్తివంతమైన గ్రహం. గురు అనుకూల స్థానంలో ఉంటే అన్నింటే శుభమే కలుగుతుందని చెబుతుంటారు పండితులు. అయితే జూలై 9 తేదీన గురుడు కదలికలు జరపనున్నాడు. దీని కారణంగా ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కావడమే కాకుండా అప్పులు తీరిపోయి ఆనందంగా గడపనున్నారంట. కాగా, ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jun 16, 2025 | 2:26 PM

వృషభ రాశి : గురు గ్రహ ప్రభావం వలన ఈ రాశి వారి జీవితం ఆనంద మయంగా కొనసాగనుంది. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది. విద్యార్థులు కూడా మంచి కాలేజీల్లో సీటు సంపాదిస్తారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యంగా అప్పులు తీరడంతో ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి : గురుడు వృశ్చిక రాశి వారికి అనేక అదృష్టాలను తీసుకొస్తున్నాడు. దీంతో ఈ రాశి వారు అప్పులున్నా భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే వీరికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. అంతే కాకుండా వీరు ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటే అది ఈ సమయంలో చేయడం చాలా శుభ ప్రదం. ఎందుకంటే ఆ పని త్వరగా పూర్తి అయిపోతుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి గురు కదలికల వలన అన్నింట శుభ ఫలితాలే కలుగుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేసి చాలా సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం కలిగే ఛాన్స్ ఉంది. విద్యార్థులకు బాగుంటుంది. చాలా రోజుల నుంచి అప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు వాటి నుంచి బయటపడుతారు.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. ఆనందకరవాతావరణం చోటుకు చేసుకోవడంతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది.

మిథున రాశి :గురు ప్రభావంతో వీరికి అనేక మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది.ఆ ప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విద్యార్తులకు బాగుంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.



