Jaggery: రోజూ బెల్లం ముక్క తింటున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి!
నేచురల్ స్వీట్నర్‌గా ఉపయోగపడే బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజూ ఒక చిన్న బెల్లం ముక్క తింటే అనేక ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇది తీపి తినాలని కోరుకునే ఆశను తీర్చడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించగలదు. రోజూ కాస్త బెల్లం తినడం వల‌్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jun 16, 2025 | 3:21 PM

చర్మ సౌందర్యానికి కూడా బెల్లం చాలా మంచిది. ప్రతిరోజూ కొద్దిగా బెల్లం తినడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారికి బెల్లం ఔషధంగా పనిచేస్తుంది. మలబద్ధకం నివారించడానికి రాత్రి పడుకునే ముందు బెల్లం తినడం ఈ రోజు నుండే ప్రారంభించండి.

బెల్లంలో ఉండే కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. రోజూ ఓ బెల్లం ముక్క తినడం వల‌్ల అలసటను కూడా తగ్గించుకోవచ్చు. భోజనం చేశాక ఓ బెల్లం ముక్క తింటే త్వరగా జీర్ణమవుతుంది. దాంతోపాటు స్వీట్స్ తినాలనే కోరికను కూడా తగ్గించుకోవచ్చు. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన టాక్సిన్లను వెలికితీస్తాయి. సీజనల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు లాంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి.

బెల్లంలో ఉండే పొటాషియం, ఫాస్పరస్ ఎముకల బలాన్ని పెంచుతాయి. దీనివల‌్ల శరీరంలో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. దీంతో మీరు దృఢంగా ఉంటారు. బెల్లం తినడం ద్వారా గొంతు సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. గొంతు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే బెల్లం తినాలి.

మధుమేహం ఉన్నవారు బెల్లం తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవాలి. అధిక పరిమాణంలో బెల్లం తీసుకోవడం మంచిది కాదు. రోజు కేవలం 5 నుంచి 10 గ్రాముల బెల్లం మాత్రమే తినాలి. భోజనం తరువాత బెల్లం తింటే ఆరోగ్యం వందశాతం నిజం. మన శరీరానికి సహజంగా మేలు చేసే బెల్లాన్ని మన రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం ద్వారా అనేక సమస్యల నుండి తప్పించుకోవచ్చు.

బెల్లం ఐరన్‌కు మంచి మూలం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు, రక్తహీనతతో బాధపడేవారు ఖచ్చితంగా బెల్లం తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు..బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , ఖనిజాలు శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలను దరిచేరకుండా చేస్తుంది.




