ముందుగా గంటల తరబడి ఒకే చోట కూర్చునే అలవాటు మానుకోవాలి. నిర్ణీత వ్యవధిలో లేచి నిలబడండి, నడిచి, మళ్లీ కూర్చోండి. అవసరమైతే ఫోన్‌లో అలారం పెట్టుకోండి. గంట తర్వాత ఐదు నిమిషాలు అయినా సరే నడక సాగించాల్సిందే.అయితే పని ఒత్తిడిలో నీళ్లు తాగడం మర్చిపోకూడదు. చాలా ఆపీసుట్లో ఏసీ ఉండటం వల్ల తక్కువ వేడిగా ఉంటుంది. దీంతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీంతో డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, అలసట, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తగినంత నీళ్లు తాగాలి.