- Telugu News Photo Gallery Technology photos Huawei launches world's first triple foldable phone Huawei Mate X Triple Foldable Phone details
Huawei Mate XT: మూడుసార్లు మడతపెట్టే ఫోన్.. హువాయ్ సంచలనం
స్మార్ట్‌ఫోన్ రూపురేఖలు రోజురోజుకీ మారిపోతున్నాయి. అధునాతన ఫీచర్లు, సరికొత్త డిజైన్స్‌తో యూజర్లను స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న ఫోన్స్‌ను రెండు సార్లు మాత్రమే ఫోల్డ్ చేసే అవకాశం ఉంది. అయితే తాజాగా మార్కెట్లోకి ఏకంగా మూడు సార్లు మడతపెట్టే ఫోన్ వచ్చేస్తోంది..
Updated on: Sep 08, 2024 | 8:39 PM

మార్కెట్లోకి ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. అంటే ఈ ఫోన్‌ను ఏకంగా మూడుసార్లు మడతపెట్టొచ్చన్నమాట. దాదాపు ఒక ట్యాబ్ సైజ్‌లో ఉండే ఈ ఫోన్‌ను మడతపెట్టడం ద్వారా సాధారణ ఫోన్‌లాగా మారుతుంది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువాయ్ ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది.

హువాయ్ మేట్ ఎక్స్‌టీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ప్రపంచంలోనే మొదటి ట్రై ఫోల్డ్ ఫోన్‌గా ఇది నిలవనుంది. సెప్టెంబర్ 10వ తేదీన ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫోన్‌ను సంబంధించిన ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి.

ఇప్పటికే ఈ ఫోన్‌ను సుమారు 7 లక్షల మందిపైగా బుకింగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుందని సమాచారం. ఈ ఫోన్‌ను కంపెనీ 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్, 16GB ర్యామ్, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌లో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర ఏకంగా రూ. 1.77 లక్షలుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. మూడు స్క్రీన్స్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

ఈ ఫోన్‌ను పవర్ ఫుల్ ప్రాసెసర్‌ను అందించనున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా అధిక కెపాసిటీ బ్యాటరీ, 5G కనెక్టివిటీ, అద్భుతమైన కెమెరా సెటప్‌తో పాటు వాటర్ రెసిస్టెంట్‌తో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.




