- Telugu News Photo Gallery Cinema photos Nidhhi Agerwal Spoke About Casting Couch Old Comments Goes Viral
Nidhhi Agerwal: నాకు చాలా బాధగా అనిపిస్తుంది.. ఎట్టకేలకు స్పందించిన నిధి అగర్వాల్..
నిధి అగర్వాల్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన నిధి.. ఇప్పుడు రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా సాంగ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్ని నిధికి చేదు అనుభవం ఎదురైంది.
Updated on: Dec 19, 2025 | 12:48 PM

నిధి అగర్వాల్.. గత రెండు మూడు రోజులుగా వార్తలలో నిలుస్తున్న పేరు. ఇటీవలే హైదరాబాద్ లోని లూలు మాల్ లో జరిగిన రాజాసాబ్ సాంగ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో నిధికి చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఇప్పుడు ఆమె పేరు తెగ వినిపిస్తుంది.

లూలు మాల్ లో రాజాసాబ్ సినిమా సాంగ్ ప్రమోషన్ కోసం వెళ్లిన నిధి దగ్గరకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ప్రయత్నించారు. దీంతో ఆమె తీవ్ర ఇబ్బంది పడింది. ఆమెను టచ్ చేస్తూ దారుణంగా ప్రవర్తించారు.

ఎట్టకేలకు బాడీగార్డ్స్ సాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నిధికి సంబంధించిన ఓల్డ్ వీడియోస్, కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

గతంలో ఆమె కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కామెంట్స్ సైతం వైరలవుతున్నాయి. సినిమా ప్రపంచంలో కాస్టింగ్ కౌచ్ అనేది రాక్షసి అని.. కానీ అది ఉందో లేదో తనకు నిజంగా తెలియదని అన్నారు. తానకెప్పుడూ అలాంటి పరిస్థితి రాలేదని తెలిపింది.

ఒకవేళ తనకు అలాంటి పరిస్థితి ఎదురైతే చాలా బాధగా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు నిధి చేసిన కామెంట్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.




