- Telugu News Photo Gallery Mouth Freshener: Eat These Things To Keep Your Mouth Fresh, Check Details Here
Mouth Freshener: భోజనం తర్వాత నోట్లో ఇవి రెండు రెబ్బలు వేసుకుంటేచాలు.. నోటి దుర్వాసన ఇట్టే మాయం అవుతుంది!
ఆహారం తిన్న తర్వాత కాసేపటికే నోటి దుర్వాసన వస్తుందా? ఎవరితోనైనా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది మీ ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుసుకోండి. బ్యాడ్ బ్రీత్‌ను నివరించేందుకు బ్యాగులో ఎల్లప్పుడూ ఈ కింది పదార్ధాలు ఉంచుకోండి. కిచెన్‌లో మౌత్‌వాష్‌గా పనిచేసే అనేక పదార్థాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. ఇవి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. మౌత్ ఫ్రెషనర్లుగా పనిచేసే 5 ఆహారాలు మీ కోసం..
Updated on: Mar 11, 2024 | 8:43 PM

ఏదైనా రెస్టారెంట్ లేదా ఈవెంట్‌కి వెళ్లినప్పుడు భోజనం తిన్న తర్వాత ఫెన్నెల్ (సోంపు గింజలు) ఇస్తారు. భోజనం చేసిన తర్వాత సోంపు తినడం మన దేశంలో ఒక సంప్రదాయం. ఫెన్నెల్ జీర్ణక్రియలో సహాయపడటమే కాకుండా నోటి దుర్వాసనను కూడా నివారిస్తుంది.

ఏలకుల్లో నోటి దుర్వాసనను నిరోధించే అనేక సమ్మేళనాలు ఉంటాయి. నోరు ఎల్లవేళలా సువాసనగా ఉండాలంటే, ఏలకులను ఎల్లప్పుడూ మీతోపాటు బ్యాగులో ఉంచుకోవాలి. అలాగే ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసం మిక్స్ చేసి, భోజనం తర్వాత ఈ నీటితో నోరు పుక్కిలిస్తే సరి. అయితే నిమ్మరసం ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే నిమ్మకాయలో ఉండే యాసిడ్ పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తుంది.

కొత్తిమీర ఆకులను తిన్నా నోటి దుర్వాసన ఇట్టే వదలిపోతుంది. ఇందులో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది శ్వాసను తాజాగా ఉంచుతుంది. తాజా కొత్తిమీర ఆకులను కొన్ని తీసుకుని, భోజనం తిన్న తర్వాత నోటిలో పెట్టుకుంటే నోటి దుర్వాసన నుంచి ఉపశమనం పొందవచ్చు.

తాజా పుదీనా ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన నుంచి చాలా కాలం పాటు ఉపశమనం పొందవచ్చు. పుదీనా ఆకులు మీకు ఇష్టం లేకపోయినా కొన్ని రోజులు ట్రై చేసి చూడండి తేడా మీకే అర్థమవుతుంది. అలాగే వంటగదిలో ఉండే దాల్చిన చెక్క ముక్క ఒకటి తీసుకుని, నోట్లో వేసుకున్నా నోటి దుర్వాసన రాకుండా నివారించవచ్చు. అయితే ఎక్కువగా తినకూడదు. ఇది గ్యాస్ సమస్యను కలిగిస్తుంది.