- Telugu News Photo Gallery Moderate To Heavy Rains In Telugu States For Next 4 Days, Here is the Detail
తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. కుంభవృష్టి కురిసే ఛాన్స్.!
తెలుగు రాష్ట్రాలకు మరోసారి ఎల్లో అలెర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని 18 జిల్లాలకు, అలాగే తెలంగాణలోని 6 జిల్లాలకు వార్నింగ్ ఇచ్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Updated on: Sep 13, 2023 | 8:15 AM

తెలుగు రాష్ట్రాలకు మరోసారి ఎల్లో అలెర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని 18 జిల్లాలకు, అలాగే తెలంగాణలోని 6 జిల్లాలకు వార్నింగ్ ఇచ్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురవనుండగా.. అకస్మాత్తుగా అక్కడక్కడ కుంభవృష్టి కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో 6 జిల్లాలకు ఇవాళ ఎల్లో వార్నింగ్ ఇచ్చింది వాతావరణశాఖ. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక, మిగతా జిల్లాలకు గ్రీన్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. అంటే, ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది

గ్రీన్ అలర్ట్ - ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, మేడ్చల్, హైదరాబాద్, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి. అయితే, ఇక్కడ 18 జిల్లాలకు ఎల్లో వార్నింగ్ వచ్చింది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది.

మిగతా 8 జిల్లాలకు గ్రీన్ అలర్ట్ మాత్రమే ఉంది. అంటే ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, పుట్టపర్తి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు గ్రీన్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలుగా ఉన్నాయి.
