- Telugu News Photo Gallery Mix These Two Things In Warm Water And Drink The Old Constipation Will Be Removed The Dirt Stuck In The Intestines Will Come Out
Home Remedy: ఈ రెండింటిని గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి తాగితే మలబద్ధకం పరార్!
మీ కడుపు మీ శరీరంలో దాదాపు ప్రతి అవయవానికి అనుసంధానించబడిన ఒక భాగం. మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటే ఆ ప్రభావం మీ చర్మం, ముఖంపై కూడా కనిపిస్తుంది. కొంతమందికి వారి కడుపు ఆరోగ్యంగా లేకుంటే లేదా శుభ్రంగా లేకుంటే దాని ప్రత్యక్ష ప్రభావం వారి ముఖంపై కనిపించడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా వారి..
Updated on: Mar 16, 2024 | 7:12 PM

మీ కడుపు మీ శరీరంలో దాదాపు ప్రతి అవయవానికి అనుసంధానించబడిన ఒక భాగం. మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటే ఆ ప్రభావం మీ చర్మం, ముఖంపై కూడా కనిపిస్తుంది. కొంతమందికి వారి కడుపు ఆరోగ్యంగా లేకుంటే లేదా శుభ్రంగా లేకుంటే దాని ప్రత్యక్ష ప్రభావం వారి ముఖంపై కనిపించడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా వారి ముఖంపై మొటిమలు, మచ్చలు కనిపిస్తాయి.

మీ కడుపు పూర్తిగా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. మీ కడుపు క్లియర్ కాకపోతే అది మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం, వాంతులు, వికారం కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు.. ప్రేగులలో పేరుకుపోయిన మురికి తలనొప్పి, అలసట, బరువు పెరగడం, అలసట లేదా బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రోజు మనం మీ పొట్టను శుభ్రం చేసే ఒక గొప్ప హోం రెమెడీ గురించి తెలుసుకుందాం. ఇది మీ సమస్యలన్నింటిని నయం చేస్తుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీరు, అర టీస్పూన్ నల్ల ఉప్పు, ఒక టీస్పూన్ నిమ్మరసం తీసుకోండి. వీటన్నింటిని బాగా కలపండి. ఈ పానీయం మార్నింగ్ ఖాళీ కడుపుతో తాగాలి.

అంతే కాకుండా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల యాపిల్ వెనిగర్ మిక్స్ చేస్తే పొట్ట శుభ్రపడుతుంది. నైట్ నిద్రించే ముందు ఈ పానియం తాగండి.

దీనితో పాటు మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు పదేపదే సూచిస్తున్నారు. దీని కోసం మీరు మీ ఆహారంలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్ వంటి పోషకాలను చేర్చుకోవాలి. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. వీటిని అనుసరించే ముందు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)




