Varuna Mudra: రోజూ ఈ ఒక్క ముద్ర వేయండి.. ఈ వ్యాధులకు బైబై చెప్పొచ్చు..
యోగా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ యోగా గురించి తెలుసు. యోగాలో అనేక ఆసనాలు ఉంటాయి. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. యోగాతో చెక్ పెట్టొచ్చు. యోగా ఆసనాలు వేయడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. యోగాలో కేవలం ఆసనాలే కాదు.. ముద్రలు కూడా ఉంటాయి. ఈ ముద్రలను పద్మాసనంలోనే వేయాల్సి ఉంటుంది. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోదగినది.. వరుణ ముద్ర. ఈ ముద్రను ప్రతి రోజూ ఓ ఐదు నిమిషాలు వేయడం వల్ల..
Updated on: Mar 16, 2024 | 7:08 PM

యోగా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ యోగా గురించి తెలుసు. యోగాలో అనేక ఆసనాలు ఉంటాయి. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. యోగాతో చెక్ పెట్టొచ్చు. యోగా ఆసనాలు వేయడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. యోగాలో కేవలం ఆసనాలే కాదు.. ముద్రలు కూడా ఉంటాయి.

ఈ ముద్రలను పద్మాసనంలోనే వేయాల్సి ఉంటుంది. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోదగినది.. వరుణ ముద్ర. ఈ ముద్రను ప్రతి రోజూ ఓ ఐదు నిమిషాలు వేయడం వల్ల.. అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఆపవచ్చు.

ఫొటోలో చూపించిన విధంగా వరుణ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఇది వేయడం చాలా సులభం. చిన్న పిల్లలు సైతం ఈ ఆసనం చేయవచ్చు. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి యోగా ఆసనాలు నేర్పించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు.

వరుణ ముద్రను ఫొటోలో చూపించిన విధంగా వేళ్లతో పెట్టాలి. పద్మాసనంలో ఉండగా ఒకేసారి ఈ ముద్ర వేయాలి. ఈ భంగిమలో కేవలం ఐదు నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఇలా ముద్ర వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.

వరుణ ముద్ర వేయడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయి. రక్తం శుభ్రపడుతుంది. జీర్ణ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. జ్వరం వంటివి కూడా రాకుండా ఉంటాయి. చర్మ సౌందర్యం కూడా మెరుగు పడుతుంది. అయితే దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉన్నవారు రెండు నిమిషాలు వేస్తే సరిపోతుంది.




