Bhimbetka Caves: భీముడు ఉన్న గుహలు.. ఇక్కడ రాళ్లపై పెయింటింగ్స్‌ను చూడాలంటే సూర్యరశ్మి కావాల్సిందే..
ఐదుగురు పాండవులలో ఒకరైన భీముడు పేరుమీద ఈ ప్రదేశం ఏర్పడిందని నమ్ముతారు. భీముడు కూర్చున్న ప్రదేశం కనుక దీనిని భీమ్ బైఠక అని కూడా అంటారు. ఈ ప్రదేశం అమెరికన్ ఉటా గ్రాండ్ కాన్యన్‌ను పోలి ఉంటుంది.
Updated on: Jul 09, 2023 | 1:26 PM

అమెరికాలోని ఉటాకు చెందిన బ్రైస్ కాన్యన్ చూడటానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వెళ్తూ ఉంటారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఎరుపు రంగు రాళ్ళకు ప్రసిద్ధి. అయితే అమెరికా లాగా, భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లో భీంబేట్కా అని పిలువబడే గుహలు కూడా రంగురాళ్లకు ప్రసిద్ధి.

ఐదుగురు పాండవులలో ఒకరైన భీముడు ఈ ప్రదేశంలో కూర్చున్నాడని నమ్ముతారు. అందుకే దీనిని భీమ్ బైఠక అని కూడా అంటారు. ఈ గుహలు మధ్యప్రదేశ్‌లోని అత్యంత ప్రసిద్ధ చెందిన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి.

భోజ్‌పూర్ భారతదేశంలోని అతిపెద్ద శివలింగం ఉన్న భీంబెట్కా నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

భారతదేశంతో పాటు విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.

ఇక్కడ 760 శిలలు ఉన్నాయి. వాటిలో 500 రాళ్లపై పెయింటింగ్స్ తయారు చేశారు. అయితే రాళ్లపై వేసిన ఈ పెయింటింగ్ సూర్యకిరణాలు నేరుగా వస్తున్నప్పుడు మాత్రమే కనిపిస్థాయి.

మధ్యప్రదేశ్‌కు చెందిన భింబేట్కా గుహల అందాలు, రహస్యాలు అమెరికాకు చెందిన ఉటా కంటే ఏమాత్రం తక్కువ కాదు. ఇక్కడ రాళ్ళు సరిగ్గా గ్రాండ్ కాన్యన్‌ను లా కనిపిస్తాయి. భారతదేశ ప్రజలు మాత్రమే కాదు విదేశీయులు కూడా ఈ గుహలకు సందర్శించడానికి భారీ సంఖ్యలో వస్తారు.





























