పిల్లలు పుట్టరని తెలిసినా పెళ్లి చేసుకున్నాడు.. ఎంతమంచివాడో అనుకుంది..చివరికి..
ప్రేమించానన్నాడు... పెళ్ళి చేసుకుంటానన్నాడు... పిల్లలు పుట్టక పోయినా పర్వాలేదన్నాడు. కులం పట్టింపు లేదన్నాడు.. ఆమె జీవితానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. 1998లో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే చూసుకున్నాడు.. ఆ తర్వాతే అసలు రంగు బయటపడింది.. అతడు పెట్టే వేధింపులు తాళలేక చివరకు పోలీసులను ఆశ్రయించింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జీవిత భీమా సంస్థలో పని చేసే కిరణ్, అనసూయలు ప్రేమించుకున్నారు. కులాలు ఒకటి కాకపోయినా.. ఆమెకు పిల్లలు పుట్టరని తెలిసినా పెద్దలను ఎదిరించి మరీ అనసూయను కిరణ్ వివాహం చేసుకున్నాడు కిరణ్. కొంత కాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. మొదట ఒక పాపను దత్తత తీసుకున్నారు.
ఆ తర్వాత కిరణ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు మారాడు. ఆ తర్వాత సరోగసి విధానం ద్వారా వీరికి ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత నుండి ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ అనసూయను వేధించడం మొదలు పెట్టాడు. ఉద్యోగ రిత్యా ఇతర ప్రాంతాల్లో పని చేస్తూ అక్కడ మహిళలతో సంబంధాలు నెరిపేవాడు. వారిని తన భార్య లేని సమయంలో ఇంటికి తీసుకొచ్చి.. వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు తీసుకొని వాటిని అనసూయకు పంపేవాడు. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయి.అనసూయ ఎల్ ఐ సిలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తుండగా, కిరణ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో డిఐజి స్థాయికి ఎదిగాడు. వీరి కుమార్తె ప్రస్తుతం ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళింది. ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న కిరణ్ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. తరుచూ ఆమెను కొడుతుండేవాడు.
మరిన్ని వీడియోల కోసం :
ఖతర్నాక్ ఐడియా.. 15 నిమిషాల్లో ఎగ్జామ్ సెంటర్‌కి చేరుకున్న విద్యార్ధి..వీడియో
ఆ గ్రామానికి ఏమైంది?కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం వీడియో
ఓర్నీ.. అది ఆటోనా..ఆర్టీసీ బస్సా..పోలీసులకు షాకిచ్చిన వీడియో
బర్డ్‌ఫ్లూ భయమే లేదు.. అక్కడ ఊరు ఊరంతా పండగే..వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
