AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioHotstar: ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో క్రికెట్ వేడుక.. సబ్‌స్క్రిప్షన్‌ కోసం కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌

JioHotstar Subscription: ఈ ప్యాకేజీలో OTT ప్లాట్‌ఫామ్ ద్వారా క్రికెట్‌ను మాత్రమే కాకుండా ఇతర వినోద కార్యక్రమాలను కూడా ఆస్వాదించవచ్చు. రాబోయే IPL 2025 ను దృష్టిలో ఉంచుకుని జియో ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్యాకేజీని ప్రారంభించింది. 90 రోజుల చెల్లుబాటుతో జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది..

JioHotstar: ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో క్రికెట్ వేడుక.. సబ్‌స్క్రిప్షన్‌ కోసం కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌
Subhash Goud
|

Updated on: Feb 23, 2025 | 8:58 PM

Share

క్రికెట్ సీజన్‌ను పండుగలా, ఉత్సాహంగా మార్చడానికి రిలయన్స్ జియో కొత్త డేటా ప్లాన్ తీసుకువచ్చింది. జియో ప్రత్యేక డేటా యాడ్-ఆన్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. PRAN జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌కు సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. ఈ ప్యాకేజీకి వినియోగదారులు రూ.195 చెల్లించాలి.

ఈ ప్యాకేజీలో OTT ప్లాట్‌ఫామ్ ద్వారా క్రికెట్‌ను మాత్రమే కాకుండా ఇతర వినోద కార్యక్రమాలను కూడా ఆస్వాదించవచ్చు. రాబోయే IPL 2025 ను దృష్టిలో ఉంచుకుని జియో ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ రూ.195 డేటా-ఓన్లీ ప్యాక్ గురించి ప్రత్యేకత ఏమిటంటే ఇందులో కొత్త OTT ప్లాట్‌ఫామ్ JioHotstar కు సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.

195 రూపాయలకు రీఛార్జ్ చేసుకుంటే మీకు 90 రోజుల చెల్లుబాటుతో జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీనితో క్రికెట్ అభిమానులు ఈ సీజన్ మొత్తాన్ని జియోహాట్‌స్టార్‌తో జరుపుకోవచ్చు. మొబైల్ వినియోగదారులకు రీఛార్జ్ పై 15GB డేటా అందించబడుతుంది. దీని చెల్లుబాటు 90 రోజులు.

ఇది కూడా చదవండి: Gautam Adani: గౌతమ్ అదానీ ప్రతి గంటకు ఎన్ని కోట్ల పన్ను చెల్లిస్తాడో తెలిస్తే మైండ్‌ బ్లాంకే..!

హై-స్పీడ్ డేటా పరిమితిని చేరుకున్న తర్వాత డేటాను 64 Kbps వద్ద ఉపయోగించవచ్చు. అయితే వినియోగదారులు తమ జియో సిమ్‌లో చెల్లుబాటు అయ్యే బేస్ సర్వీస్ ప్లాన్ ఉంటేనే రూ.195 ప్యాక్‌ను ఉపయోగించవచ్చు. జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ నుండి కంటెంట్‌ను కలపడం ద్వారా ‘జియో హాట్‌స్టార్’ ప్రారంభించింది.

ఇప్పుడు మనం రెండు ప్లాట్‌ఫామ్‌ల నుండి సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ మ్యాచ్‌లు, వెబ్ సిరీస్‌లతో సహా అన్ని కంటెంట్‌లను JioHotstar అనే ఒకే ప్లాట్‌ఫామ్‌లో చూడవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్, రాబోయే IPL 2025 జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Viral Video: అంతరిక్షంలో ఒకేసారి రెండు కాళ్లను ప్యాంటులో పెట్టుకోవచ్చు.. అద్భుతమైన వీడియో షేర్‌

దీనితో పాటు, జియో రూ.49కి క్రికెట్ ఆఫర్ అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్‌ను కూడా అందిస్తోంది. ఇది రోజుకు 25GB డేటాను అందిస్తుంది. దీనితో పాటు కంపెనీ 84 రోజుల చెల్లుబాటుతో రూ.949 ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఇందులో రోజుకు 2GB హై-స్పీడ్ 4G డేటా, అపరిమిత 5G డేటా ఉన్నాయి. అదనంగా, వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS లను పొందుతారు. ఈ ప్లాన్ ప్రత్యేకత రూ. 149 విలువైన ఉచిత జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్.

ఇది కూడా చదవండి: Azim Premji: భారత్‌లోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త.. ప్రతిరోజూ రూ. 27 కోట్లు విరాళం.. ఇతనెవరో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి