హైదరాబాద్ టు ధర్మపురి.. వయా వేములవాడ.. నయా టూర్ ప్యాకేజీ..
TV9 Telugu
23 February 2025
తెలంగాణలోని ఉత్తరాన ఉన్న కొన్ని ప్రముఖ ఆలయాలను దర్శించుకొనేందుకు Sathavahana Region ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం.
ఈ కొత్త టూర్ ప్యాకేజీ ప్రతి వీకెండ్ శనివారం, ఆదివారం తేదీల్లో హైదరాబాద్ నగరం నుంచి అందుబాటులో ఉంటుంది.
నాన్ ఏసీ కోచ్ బస్సులో కొనసాగనున్న ఈ ప్యాకేజీ టికెట్ ధరలు విషయానికి వస్తే పెద్దలకు రూ. 1999, పిల్లలకు రూ 1,599గా నిర్ణయించారు.
ఈ శాతవాహన టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారి కోసం హైదరాబాద్లోని బషీర్ బాగ్ వద్ద ఉదయం 7 గంటలకు పికప్ ఉంటుంది.
మొదటి రోజు బయల్దేరి 08.30 గంటలకు ప్రజ్ఞాపూర్ చేరుకొని 9 గంటల వరకు హారిత హోటల్లో టీ, టిఫిన్ ఉంటుంది.
తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వేములవాడకు చేరుకొని 10.30 నుంచి 11.30 గంటల మధ్య రాజన్నను దర్శించుకొంటారు.
తదుపరి బస్సులో మధ్యాహ్నం 12.15 గంటలకు కొండగట్టు చేరుకొని అంజన్న దర్శనం చేసుకొని హారిత హోటల్లో లంచ్ చేసి 02.30 గంటలకు స్టార్ట్ అవుతారు.
తర్వాత సాయంత్రం 4 గంటలకు ధర్మపురి చేరుకొని అక్కడ నరసింహస్వామి దర్శనం పూర్తి చేసుకొని టీ తాగి 6 గంటలకు బయల్దేరి రాత్రి 10 హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.