ఎక్కువ కాలం నివసించే వ్యక్తులు ఏదేశంలో ఉన్నారో తెలుసా?
TV9 Telugu
12 February 2025
మీరు ఇకిగై పుస్తకం చదివి ఉంటే, ఈ పుస్తకం జపాన్‌లోని ఒక గ్రామం గురించి చెబుతుంది. ఆ గ్రామంలోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు. అంతే సంతోషంగా ఉంటారు.
జపాన్‌లాగే ప్రపంచంలో "బ్లూ జోన్లు" అని పిలువబడే 6 ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ కాలం సంతోషంగా జీవిస్తారు.
బ్లూ జోన్లు అంటే ప్రజలు మంచి ఆహారపు అలవాట్లు, అలాగే అనారోగ్య సమస్యలు తగ్గువగా ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది.
ఆ పుస్తకంలో ప్రస్తావించిన జపాన్‌లోని ప్రదేశం ఒకినావా. బ్లూ జోన్ల జాబితాలో ఒకినావా అగ్రస్థానంలో ఉంది. ఒకినావాలో ప్రజల ఆయుర్దాయం 87 సంవత్సరాల వరకు ఉంటుంది.
గ్రీస్‌కు చెందిన ఇకారియా కూడా ఈ జాబితాలో ఉంది. ఇకారియాలో నివసించే ప్రజల ఆయుర్దాయం 90 సంవత్సరాలకు పైగా ఉంది.
ఇటలీలోని సార్డినియాలో కూడా ఆయుర్దాయం 100 వరకు ఉంటుంది. ఇందులో కోస్టా రికాకు చెందిన నికోయా కూడా ఉంది. నికోయాలోని ప్రజలు 85 సంవత్సరాల వరకు జీవిస్తారు.
ఈ జాబితాలో అమెరికా కూడా ఉంది. అమెరికాలోని లోమా లిండా CA బ్లూ జోన్‌లో భాగమైన ప్రాంతం. ఇక్కడ పురుషులు 89 సంవత్సరాలు, స్త్రీలు 91 సంవత్సరాలు జీవిస్తారు.
2023 సంవత్సరంలో సింగపూర్ దేశాన్ని కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇక్కడి ప్రజలు 82 సంవత్సరాల వరకు జీవిస్తారు.