భద్రతా కారణాల దృష్ట్యా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులు ChatGPT, Deepseek లను ఉపయోగించకుండా నిషేధించింది.
వారం రోజుల క్రితం OpenAI కూడా ChatGPT కోసం ఒక పెద్ద ప్రకటన చేసింది. ఓపెన్ AI వినియోగదారులకు ChatGPT ఫీచర్‌ను అందుబాటులోకి వచ్చింది.
దీంతో సైన్ అప్ చేయకుండానే చాట్‌బాట్‌ను ఉపయోగించగలరు. గతంలో chatgpt.comని సందర్శించినప్పుడు, Google, Apple లేదా Microsoft ఖాతాతో లాగిన్ అవ్వాల్సి వచ్చేది.
కానీ ఇప్పుడు కంపెనీ సైన్అప్ ఆప్షన్‌ను తొలగించింది. దీంతో ఇప్పుడు అందరూ సులభంగా ChatGPTని ఉపయోగించవచ్చు.
ఈ ప్రకటనపై OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ స్పందించారు. 'ఇకపై నేరుగా శోధన చేయండి.' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
OpenAI నవంబర్ 2024లో ChatGPT శోధన ఫీచర్‌ను ప్రారంభించింది. కానీ ఆ సమయంలో అది ప్రిమియమ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
ఇప్పుడు అందరు వినియోగదారులకు ChatGPT ఫీచర్ ఉచితంగా మారింది. ChatGPT శోధన ఫీచర్ OpenAI అప్‌గ్రేడ్ చేసిన GPT-4 మోడల్ ద్వారా ఆధారితమైనది.
ఈ ఫీచర్ ద్వారా వెబ్‌లో శోధించడమే కాకుండా, ఇది మిమ్మల్ని తదుపరి ప్రశ్నలు అడగడానికి కూడా అనుమతిస్తుంది.