- Telugu News Photo Gallery Cinema photos Actress Bhavya Trikha Takes Holy Dip At Maha Kumbh Mela 2025, Photos Goes Viral
Tollywood: మహా కుంభమేళాలో మరో అందం.. త్రివేణి సంగమంలో హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. సామాన్యులతోపాటు సినీతారలు, రాజకీయ నాయకులు సైతం ప్రయాగ్ రాజ్ వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది హీరోహీరోయిన్స్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. తాజాగా మరో హీరోయిన్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.
Updated on: Feb 24, 2025 | 3:57 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. ఒక్క సినిమాతోనే తమిళం, తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఇప్పుడు మహా కుంభమేళాలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?

ఆ అందాల తార మరెవరో కాదండి.. మలయాళీ బ్యూటీ భవ్య త్రిఖ. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు అంతగా తెలియదు.. కానీ జ్యో సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. మొదటి సినిమాతోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

తమిళంలో విడుదలైన జో సినిమాతో చాలా పాపులర్ అయ్యింది భవ్య త్రిఖ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో రియో రాజ్ హీరోగా నటించగా.. భవ్య త్రిఖ, మాళవిక హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమాలో అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది భవ్య. దీంతో ఈ ముద్దుగుమ్మకు సౌత్ ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయమనుకున్నారు. కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రావడం లేదు.

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే భవ్య.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా మహా కుంభమేళాకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేయగా.. క్షణాల్లో వైరలవుతున్నాయి. ప్రస్తుతం తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తుంది.




