డాక్టర్ ఆదిత్య విదుషి ఏం చెబుతున్నారంటే.. సిగరెట్, బీడీ వంటి ధూమపానం అలవాట్లు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సాధారణ కారణం. ధూమపానం చేయని వారితో పోలిస్తే ధూమపానం చేసేవారికి 20 రెట్లు ప్రమాదం ఉంది. ధూమపానం మానేయడం వల్ల ఈ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. కౌన్సెలింగ్, నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, కొన్ని యాంటీ-క్రావింగ్ మందులు ధూమపానం చేసేవారిలో శాశ్వతంగా అలవాటు మానేయడానికి సహాయపడుతుంది.