Pumpkin Seeds: గుమ్మడి గింజలు నిద్రకు ముందు ఓ స్ఫూన్ తిన్నారంటే.. కమ్మని నిద్ర మీసొంతం!
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో గుమ్మడి గింజలు మొదటి స్థానంలో ఉంటాయి. త్వరగా బరువు తగ్గడానికి, శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. గుమ్మడి గింజలు చాలా పోషకమైనవి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Feb 24, 2025 | 12:46 PM

నేటి కాలంలో అధిక మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. త్వరగా బరువు తగ్గడానికి వివిధ రకాల విత్తనాలను తింటుంటారు. వీటిలో చియా గింజలు, అవిసె గింజలు, జనపనార గింజలు, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు ముఖ్యమైనవి. ఈ విత్తనాలు డైటింగ్, శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. వీటన్నింటిలో గుమ్మడి గింజలు చాలా పోషకమైనవి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఈ విత్తనాలను రోజుకు ఒక టేబుల్ స్పూన్ తింటే శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ విత్తనాలు గుండె ఆరోగ్యం నుంచి మెదడు పనితీరు వరకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతుంది. గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్, మెలటోనిన్ అనే శరీరం సహజ నిద్ర హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇందులోని మెగ్నీషియం కండరాలు, నరాలను మరింత సడలిస్తుంది.

ఈ విత్తనాల్లో జింక్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా జింక్ నరాల సిగ్నలింగ్, మెదడు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

గుమ్మడికాయ గింజల్లో జింక్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. జింక్ గాయాలను నయం చేయడానికి, జలుబుతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ E యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. వాపును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది.




