సమ్మర్‌లో తాటికల్లుకు ఫుల్ డిమాండ్.. తాగితే ఎన్ని ప్రయోజనాలో..
పల్లెటూర్లలో ఎక్కువ మంది ఉదయం, సాయంత్రం ఎంతో ఇష్టంగా తాటి కల్లు తాగుతుంటారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో తాటికళ్లు ఎక్కువ లభిస్తుంది. అంతే కాకుండా ఇక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ తాటి కల్లు ఉండాల్సిందే. ఇక ఈ తాటికల్లును చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట. మరీ ముఖ్యంగా తాటికల్లుకు సమ్మర్‌లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇది శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా అనేక సమస్యల నుంచి కాపాడుతుంది
Updated on: Feb 24, 2025 | 12:11 PM

అయితే కొంత మంది మాత్రం దీనిని అల్కహాల్‌గా భావించడమే కాకుండా తాగడానికి భయపడిపోతుంటారు. కానీ తాటి కల్లు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

తాటి కల్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇప్పటి రోజుల్లో చాలా వరకు కల్తీ కల్లు లభిస్తుంది. అయితే అందుకే ఎప్పుడూ కల్లు తాగినా.. చెట్టుపై నుంచి అప్పటికప్పుడు తీసే కల్లు మాత్రమే తాగాలి అంట. ఎందుకంటే ఇదులో అనేక ఔషధ గుణాలు ఉంటాయంట.

తాటికల్లులో విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ సీ, బీ, ఐరన్ ,ప్రొటిన్స్ కూడా పుష్కలంగా ఉండటం వలన దీని వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవంట. మరీ ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో తాటి కల్లు కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.

అలాగే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుందంట, క్యాన్సర్‌కు చెక్ పెట్టడంలో ఇది కీలక పాత్ర పోషించడమే కాకుండా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు యాంటి బయోటిక్‌గా తాటికల్లు పనిచేస్తుందంటున్నారు వైద్యులు.

తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం, మలబద్దకం, అల్సర్ వంటి సమస్యలు, ఉదర సంబంధ సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాటి కల్లు తాగడం వలన కల్లులో ఉండే ఔషధ గుణాలు కడుపును క్లీన్ చేసి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందంట. అందుకే ఈ తాటికల్లుకు తెలంగాణాలో ఫుల్ డిమాండ్ ఉంటుంది అంటున్నారు నిపుణులు.



