AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్‌పై అత్యధిక రన్స్‌ చేసిన టాప్‌ 5 భారత ప్లేయర్లు వీళ్లే! లిస్ట్‌లో నో విరాట్‌ కోహ్లీ..!

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్‌ విక్టరీ సాధించింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. దీంతో పాకిస్థాన్‌పై మరోసారి ఐసీసీ ట్రోర్నీలో ఉన్న విన్నింగ్‌ రికార్డ్‌ను మరింత మెరుగుపర్చుకుంది. అయితే అసలు ఇప్పటి వరకు పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన టాప్‌ 5 బ్యాటర్లు ఎవరి చూస్తే.. దిగ్గజాల పేర్లు కనిపించాయి. ఆశ్చర్యకరంగా ఆ లిస్ట్‌లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ పేర్లు కనిపించలేదు. మరి ఆ టాప్‌ 5లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

SN Pasha
|

Updated on: Feb 24, 2025 | 1:01 PM

Share
సచిన్‌ టెండూల్కర్‌..
పాకిస్థాన్‌తో 1989 నుంచి 2012 మధ్య కాలంలో మొత్తం 69 మ్యాచ్‌లు ఆడాడు సచిన్‌ టెండూల్కర్‌. వాటిలో 67 ఇన్నింగ్స్‌ల్లో 40.09 యావరేజ్‌, 87.49 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 2526 పరుగులు సాధించాడు. వాటిలో ఐదు సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 141. బౌండరీలు 294, సిక్సులు 29 ఉన్నాయి. నాలుగు సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 5 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు.

సచిన్‌ టెండూల్కర్‌.. పాకిస్థాన్‌తో 1989 నుంచి 2012 మధ్య కాలంలో మొత్తం 69 మ్యాచ్‌లు ఆడాడు సచిన్‌ టెండూల్కర్‌. వాటిలో 67 ఇన్నింగ్స్‌ల్లో 40.09 యావరేజ్‌, 87.49 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 2526 పరుగులు సాధించాడు. వాటిలో ఐదు సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 141. బౌండరీలు 294, సిక్సులు 29 ఉన్నాయి. నాలుగు సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 5 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు.

1 / 5
రాహుల్‌ ద్రవిడ్‌..
పాకిస్థాన్‌తో 1996 నుంచి 2009 మధ్య కాలంలో మొత్తం 58 మ్యాచ్‌లు ఆడాడు రాహుల్‌ ద్రవిడ్‌. వాటిలో 55 ఇన్నింగ్స్‌ల్లో 36.51 యావరేజ్‌, 67.17	 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 1899 పరుగులు సాధించాడు. వాటిలో 2 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌  107. బౌండరీలు 157, సిక్సులు 1 ఉన్నాయి. 3 సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 3 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు.

రాహుల్‌ ద్రవిడ్‌.. పాకిస్థాన్‌తో 1996 నుంచి 2009 మధ్య కాలంలో మొత్తం 58 మ్యాచ్‌లు ఆడాడు రాహుల్‌ ద్రవిడ్‌. వాటిలో 55 ఇన్నింగ్స్‌ల్లో 36.51 యావరేజ్‌, 67.17 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 1899 పరుగులు సాధించాడు. వాటిలో 2 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 107. బౌండరీలు 157, సిక్సులు 1 ఉన్నాయి. 3 సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 3 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు.

2 / 5
మొహమ్మద్‌ అజహరుద్దీన్‌..
పాకిస్థాన్‌తో 1985 నుంచి 2000 మధ్య కాలంలో మొత్తం 64 మ్యాచ్‌లు ఆడాడు మొహమ్మద్‌ అజహరుద్దీన్‌. వాటిలో 59 ఇన్నింగ్స్‌ల్లో 31.86 యావరేజ్‌, 67.68 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 1657	 పరుగులు సాధించాడు. వాటిలో 2 సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 101. బౌండరీలు 108, సిక్సులు 12 ఉన్నాయి. 7 సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 3 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు.

మొహమ్మద్‌ అజహరుద్దీన్‌.. పాకిస్థాన్‌తో 1985 నుంచి 2000 మధ్య కాలంలో మొత్తం 64 మ్యాచ్‌లు ఆడాడు మొహమ్మద్‌ అజహరుద్దీన్‌. వాటిలో 59 ఇన్నింగ్స్‌ల్లో 31.86 యావరేజ్‌, 67.68 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 1657 పరుగులు సాధించాడు. వాటిలో 2 సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 101. బౌండరీలు 108, సిక్సులు 12 ఉన్నాయి. 7 సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 3 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు.

3 / 5
సౌరవ్‌ గంగూలీ..
పాకిస్థాన్‌తో 1996 నుంచి 2007 మధ్య కాలంలో మొత్తం 53 మ్యాచ్‌లు ఆడాడు సౌరవ్‌ గంగూలీ. వాటిలో 50 ఇన్నింగ్స్‌ల్లో 35.14 యావరేజ్‌, 71.82 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 1652 పరుగులు సాధించాడు. వాటిలో 2 సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 141. బౌండరీలు 161, సిక్సులు 17 ఉన్నాయి. 3 సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 4 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు.

సౌరవ్‌ గంగూలీ.. పాకిస్థాన్‌తో 1996 నుంచి 2007 మధ్య కాలంలో మొత్తం 53 మ్యాచ్‌లు ఆడాడు సౌరవ్‌ గంగూలీ. వాటిలో 50 ఇన్నింగ్స్‌ల్లో 35.14 యావరేజ్‌, 71.82 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 1652 పరుగులు సాధించాడు. వాటిలో 2 సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 141. బౌండరీలు 161, సిక్సులు 17 ఉన్నాయి. 3 సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 4 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు.

4 / 5
యువరాజ్‌ సింగ్‌..
పాకిస్థాన్‌తో 2003 నుంచి 2017 మధ్య కాలంలో మొత్తం 38 మ్యాచ్‌లు ఆడాడు సచిన్‌ టెండూల్కర్‌. వాటిలో 38 ఇన్నింగ్స్‌ల్లో 42.50 యావరేజ్‌, 93.47 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 1360 పరుగులు సాధించాడు. వాటిలో ఒక సెంచరీ, 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 107(నాటౌట్‌). బౌండరీలు 146, సిక్సులు 22 ఉన్నాయి. 6 సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 2 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు. అయితే ఈ లిస్ట్‌లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లాంటి స్టార్‌ ప్లేయర్ల పేరు లేకపోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. 2009లో ముంబైలో ఉగ్రదాడి తర్వాత.. భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదనే విషయం తెలిసిందే. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే పాకిస్థాన్‌తో తలపడే అవకాశం కోహ్లీ, రోహిత్‌కు వస్తోంది. ఒక వేళ పాక్‌తో వన్డే, టెస్ట్‌, టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి ఉంటే.. కచ్చితంగా విరాట్‌ కోహ్లీ టాప్‌ 5లో ఉండే వాడు. అప్పుడప్పుడు ఆడినా కూడా కోహ్లీకి పాక్‌పై తిరుగులేని రికార్డ్‌ ఉంది.

యువరాజ్‌ సింగ్‌.. పాకిస్థాన్‌తో 2003 నుంచి 2017 మధ్య కాలంలో మొత్తం 38 మ్యాచ్‌లు ఆడాడు సచిన్‌ టెండూల్కర్‌. వాటిలో 38 ఇన్నింగ్స్‌ల్లో 42.50 యావరేజ్‌, 93.47 స్ట్రైక్‌ రేట్‌తో ఏకంగా 1360 పరుగులు సాధించాడు. వాటిలో ఒక సెంచరీ, 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 107(నాటౌట్‌). బౌండరీలు 146, సిక్సులు 22 ఉన్నాయి. 6 సార్లు నాటౌట్‌గా నిలిస్తే, 2 మ్యాచ్‌ ల్లో డకౌట్‌ అయ్యాడు. అయితే ఈ లిస్ట్‌లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లాంటి స్టార్‌ ప్లేయర్ల పేరు లేకపోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. 2009లో ముంబైలో ఉగ్రదాడి తర్వాత.. భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదనే విషయం తెలిసిందే. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే పాకిస్థాన్‌తో తలపడే అవకాశం కోహ్లీ, రోహిత్‌కు వస్తోంది. ఒక వేళ పాక్‌తో వన్డే, టెస్ట్‌, టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి ఉంటే.. కచ్చితంగా విరాట్‌ కోహ్లీ టాప్‌ 5లో ఉండే వాడు. అప్పుడప్పుడు ఆడినా కూడా కోహ్లీకి పాక్‌పై తిరుగులేని రికార్డ్‌ ఉంది.

5 / 5