Kitchen Tips: రంగు, రుచి మారకుండా ఏడాది పొడవునా కొత్తిమీర నిల్వ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?

కొత్తిమీర ఒకటి, రెండు రోజులకు మించి ఫ్రెష్‌గా ఉండదు. ఇక ఫ్రిజ్‌లో పెడితే వారం రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. కానీ కొత్తిమీర మార్కెట్లో అన్నీ కాలాల్లో అందుబాటులో ఉండదు. కానీ చలికాలంలో లభ్యమైనంతగా వేసవి రోజుల్లో కొత్తిమీర లభించదు. అందుకే వేసవిలో కొత్తిమీర చాలా ఖరీదైనది. చల్లటి వాతావరణంలో కొత్తిమీర బాగా పెరుగుతుంది. టబ్‌లో కొన్ని కొత్తిమీర గింజలు జల్లి సులువుగా వీటిని ఇంట్లోనే పెంచుకోవచ్చు. కొత్తిమీర ఏ ఆహారానికి అయినా భిన్నమైన రుచిని ఇస్తుంది. కొత్తిమీర ఆకులు మంచి వాసన కలిగి ఉంటాయి..

Srilakshmi C

|

Updated on: Jan 25, 2024 | 11:55 AM

పచ్చి కొత్తిమీరలో ఉండే మూలకాలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మగవారితో పోలిస్తే ఆడవారికే మూత్ర సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే పచ్చికొత్తిమీరను తింటే మూత్ర సమస్యలు కూడా తగ్గిపోతాయి. శరీరానికి చలువ చేసే గుణం పచ్చి కొత్తిమీరకు ఉంటుంది.

1 / 5
చల్లటి వాతావరణంలో కొత్తిమీర బాగా పెరుగుతుంది. టబ్‌లో కొన్ని కొత్తిమీర గింజలు జల్లి సులువుగా వీటిని ఇంట్లోనే పెంచుకోవచ్చు. కొత్తిమీర ఏ ఆహారానికి అయినా భిన్నమైన రుచిని ఇస్తుంది. కొత్తిమీర ఆకులు మంచి వాసన కలిగి ఉంటాయి. అయితే కొత్తిమీర ఆకులను ఇలా భద్రపరిస్తే ఏడాది పొడవునా నిల్వ చేసుకోవచ్చు. దాని రంగు, వాసన కూడా మారదు. కొత్తిమీర ఆకులను ఎలా నిల్వ చేయాలో ఇప్పుడు చూద్దాం..

2 / 5
పచ్చికొత్తిమీరతో కళ్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీనిలో విటమిన్ -ఎ పుష్కలంగా ఉంటుంది. మన కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది.  పచ్చి కొత్తిమీర తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కంటిచూపు కూడా బాగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

3 / 5
శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించడానికి కూడా కొత్తిమీర ఉపయోగపడుతుంది. ఫలితంగా గుండెపోటు సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి. పచ్చి కొత్తిమీరలో ఉండే మూలకం కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. పచ్చి కొత్తిమీరతో పాటుగా ధనియా వాటర్ ను కూడా కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌ చేస్తుంది.

4 / 5
అవసరమైతే దానిని ఆరబెట్టడానికి మరొక రోజు గదిలో ఉంచవచ్చు. ఇప్పుడు ఒక కూజాను బాగా కడిగి శుభ్రంగా పొడిగా తుడవాలి. అందులో ఎండిన కొత్తిమీర తరుగు వేయాలి. ఈ విధంగా ఫ్రీజ్‌ అవసరం లేకుండా ఒక సంవత్సరం పాటు కొత్తిమీరను నిల్వ చేయవచ్చు. రుచి, వాసనలో ఏమాత్రం మార్పురాదు.

5 / 5
Follow us