Homemade Neem Soap: ఇంట్లోనే వేప సబ్బు ఇలా సులువుగా తయారు చేసుకోండి.. చర్మ సమస్యలన్నీ పరార్!
వేపలోని ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేప చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వేపలో ఎన్ని ఔషధ గుణాలున్నాయంటే శరీర రక్తాన్ని కూడా పూర్తిగా శుభ్రపరుస్తుంది. ఇది రక్తం నుండి విషాన్ని తొలగించడం ద్వారా రక్తాన్ని నిర్విషీకరణ చేస్తుంది. రక్తం శుభ్రంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీరిపి వేప కూడా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేప ఆకులను తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది..