- Telugu News Photo Gallery Kitchen tiles can be easily cleaned if they become greasy, Check Here is Details
Cleaning Tips: కిచెన్‌లో టైల్స్ జిడ్డుగా మారాయా! ఇలా ఈజీగా క్లీన్ చేయవచ్చు..
కిచెన్‌ని శుభ్రంగా ఉంచాలంటే అంత సులభమైన విషయం కాదు. ఎక్కడికక్కడ మురికి, జిడ్డు పేరుకుపోతుంది. వీటిల్లో టైల్స్ కూడా ఒకటి. టైల్స్ కూడా మురికి పట్టి.. చాలా జిడ్డుగా మారతాయి. వీటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టం..
Updated on: Nov 30, 2024 | 5:20 PM

సాధారణంగా కిచెన్‌లో ఉండే టైల్స్ చాలా జిడ్డిగా, మురికిగా ఉంటాయి. ఈ జిడ్డు అస్సలు పోనే పోదు. చాలా మొండిగా తయారవుతాయి. వీటిని వదిలించాలంటే చాలా కష్టం. ఎప్పటికప్పుడు స్టవ్ క్లీన్ చేసేటప్పుడు క్లీన్ చేస్తే టైల్స్ మీద ఉన్న జిడ్డు పోతుంది. కానీ చాలా రోజులకు క్లీన్ చేస్తే మురికి అస్సలు పోదు.

జిడ్డు మాత్రమే కాకుండా నూనె మరకలు, మసాల దినుసుల మరకలు కూడా పతాయి. వీటిని అలానే వదిలేస్తే క్లీన్ చేయడం కష్టం. ఈ చిట్కాలతో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూడండి.

డిటర్జెంట్ పౌడర్‌తో టైల్స్‌పై పడ్డ మురికిని ఈజీగా క్లీన్ చేయవచ్చు. డిటర్జెంట్ పౌడర్‌లో కొద్దిగా నిమ్మరసం, బేకింగ్ సోడా, వాటర్ వేసి కలిపి ముందు మరకలపై స్ప్రే చేయండి. ఆ తర్వాత కొబ్బరి పీచుతో గోడలపై రుద్దితే మురికి ఈజగా వచ్చేస్తుంది.

సాల్ట్‌తో కూడా కిచెన్ టైల్స్‌పై పడ్డ మురికిని చాలా సులభంగా వదిలించుకోవచ్చు. నీళ్లను వేడి చేసి.. అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. ఈ మిశ్రమాన్ని టైల్స్‌పై స్ప్రే చేసి.. పాడైపోయిన టూత్ బ్రష్ లేదా బట్టల బ్రష్ సహాయంతో రుద్దితే మరకలు పోయి క్లీన్ గా ఉంటుంది.

బేకింగ్ సోడా - షాంపూ సహాయంతో కూడా మరకలను ఈజీగా వదిలించుకోవచ్చు. షాంపూని నీటిలో కలిపి అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేయాలి. ఆ తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ నీటితో గరుకుగా ఉండే స్క్రబ్బర్ లేదా కొబ్బరి పీచుతో రుద్దితో మరకలు పోతాయి.




