- Telugu News Photo Gallery Jhansi's Patali Hanuman Temple: 7 Feet Underground, Mysterious Water Emerges from Walls Annually
సాక్షత్తూ ఆ భగవంతుడి మహత్యమే.. హనుమంతుడి పాదాలను తాకుతున్న భూగర్భజలం.. ఈ అద్భుతం ఎక్కడంటే..
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో సిప్రి బజార్‌లో ఉన్న పాటలీ హనుమాన్ ఆలయం ఒక ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం. ఈ ఆలయం స్థానికంగా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, విశ్వాసం రహస్యానికి సజీవ చిహ్నంగా పిలువబడుతుంది. భూమి నుండి 7 అడుగుల దిగువన నిర్మించబడిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఒక అద్భుతం జరుగుతుంది. ఆలయానికి ఎలాంటి పైప్‌లైన్, ఇతర నీటి సదుపాయాలు లేకున్నా.. స్వావివారి గర్భగుడిలో గొడల నుంచి నీరు స్వయంగా రావడం ఇక్కడి ప్రత్యేకత.
Updated on: Jul 27, 2025 | 12:02 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో భూమి నుండి 7 అడుగుల కిందకు నిర్మించబడిన ఈ పాటలీ హనుమాన్ మందిర్‌లో ప్రతి సంవత్సరం ఒక అద్భుతం జరుగుతుంది. ఆలయానికి ఎలాంటి పైప్‌లైన్, ఇతర నీటి సదుపాయాలు లేకున్నా.. స్వావివారి గర్భగుడిలో గోడలు, నేల నుండి నీరు ఉద్భవిస్తుందని, దీనిలో స్వయంబూ ఆ హనుమంతుడే కూర్చుని 7 నెలలు తపస్సు చేస్తాడని అక్కడి పూజారులు చెబుతున్నారు.

ఆలయ పూజారి లల్లన్ మహారాజ్ ప్రకారం.. ఆయల గర్భగుడిలోకి వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదని.. ఆలయానికి ఎలాంటి పైప్‌లైన్ లేదా నీటి సదుపాయం కూడా లేదుని చెప్పారు. ఈ పవిత్ర జలం పాతాళం నుండే ఉద్భవిస్తుందని, హనుమంతుడు ఈ నీటిలో కూర్చుని 7 నెలలు తపస్సు చేస్తాడని ఆయన పేర్కొన్నారు.

ఇలా గర్బగుడిలోకి చేరే నీరు నెమ్మదిగా హనుమంతుడి పాదాలను తాకి తర్వాత నడుము వరకు పెరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమయంలో, భక్తులు ఆలయ గర్భగుడిలో కూర్చుని సుందరకాండను పారాయణం చేస్తారని ఆయన వివరించారు. ప్రతి మంగళవారం శనివారం స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. భక్తులు ఈ నీటిని అమృతంగా భావిస్తారు.

ఉదయం 7 నుండి 7:30 గంటల మధ్య, ఆలయ గర్భగుడిలో ఉన్న హనుమంతుడి విగ్రహం నవ్వుతున్న ముఖంతో భక్తులకు కనిపిస్తోంది. దీనిని భక్తులు దైవిక అద్భుతంగా భావిస్తారు. శిథిలమైన స్థితి నుండి పునరుద్ధరించబడిన ఈ ఆలయం ఇప్పుడు ఝాన్సీకి మాత్రమే కాకుండా మొత్తం బుందేల్‌ఖండ్‌కు విశ్వాస కేంద్రంగా మారింది.

ఈ అద్భుతాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సదర్శిస్తారు. ఇలా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలకు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తారు.




