AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Coconut: పచ్చి కొబ్బరిని చీప్‌గా చూడకండి.. మెదడుకి పదును నుంచి జుట్టు పోషణ వరకు ఎన్నో లాభాలు!

పూజలో పలహారం నుంచి వంట వరకు వివిధ మార్గాల్లో ఉపయోగించే పచ్చి కొబ్బరి నిజంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పోషక విలువలను పరిశీలిస్తే మీరు ఇదే అంటారు. పచ్చి కొబ్బరి తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. కొబ్బరిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి..

Raw Coconut: పచ్చి కొబ్బరిని చీప్‌గా చూడకండి.. మెదడుకి పదును నుంచి జుట్టు పోషణ వరకు ఎన్నో లాభాలు!
Raw Coconut
Srilakshmi C
|

Updated on: Jul 27, 2025 | 9:23 PM

Share

కొబ్బరి నీరు ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సహజ పానీయం చర్మం నుంచి జుట్టు ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరి నీళ్లేకాదు తాజా కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పూజలో పలహారం నుంచి వంట వరకు వివిధ మార్గాల్లో ఉపయోగించే పచ్చి కొబ్బరి నిజంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పోషక విలువలను పరిశీలిస్తే మీరు ఇదే అంటారు. 100 గ్రాముల తాజా కొబ్బరిలో 354 కేలరీలు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 9 గ్రాముల ఫైబర్, 3.3 గ్రాముల ప్రోటీన్ (100 మి.లీ. పాలకు సమానం), 33 గ్రాముల కొవ్వు, 30 గ్రాముల మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ (MTC) ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి పరిశోధనలో కొబ్బరిలోని ఈ MCT.. బరువు తగ్గడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.

అంతేకాదు తాజా కొబ్బరిలో ఎన్నో ఖనిజాలు, విటమిన్లు కూడా ఉన్నాయి. కొబ్బరిలో జింక్‌, సెలీనియం, జింక్, పొటాషియం, కాల్షియం, ఐరన్‌ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్లు B12, 2, 3, 6, 9, విటమిన్ C, E కూడా అధికంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్న పచ్చి కొబ్బరిని ఆహారంలో తీసుకోవడం ఎంతో ప్రయోజనకరం. అయితే రోజుకు 30 నుంచి 40 గ్రాములు మాత్రమే తినాలి. దీనిని భోజనంలో భాగంగా, చిరుతిండిగా తీసుకోవచ్చు. దీని వినియోగం కడుపును ఎక్కువ సమయం నిండుగా ఉంచడమే కాకుండా, జంక్ ఫుడ్, అధిక కార్బ్ ఆహారాలను అధికంగా తీసుకోవడాన్ని నివారిస్తుంది.

పచ్చి కొబ్బరి ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

రోగనిరోధక శక్తి

పచ్చి కొబ్బరి తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. కొబ్బరిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

ఊబకాయాన్ని తగ్గిస్తుంది

పచ్చి కొబ్బరి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొబ్బరిలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ శరీరంలోని కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడతాయి. ఆకలిని అణిచివేస్తాయి. దీని కారణంగా, బరువును నియంత్రించవచ్చు.

మెదడును పదును పెట్టడానికి సహాయపడుతుంది

పచ్చి కొబ్బరి శరీరానికి మాత్రమే కాకుండా మెదడుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అవును, ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో చాలా సహాయపడుతుంది. ఇందులో ఐరన్‌, విటమిన్ B6 ఉంటాయి. ఇవి మెదడును పదును పెట్టడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి.

చర్మం, జుట్టుకు ప్రయోజనకరం

పచ్చి కొబ్బరిలో విటమిన్లతో పాటు, అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం, జుట్టుకు తగినంత పోషణను అందిస్తుంది. దీనిలో లభించే విటమిన్ E చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తుంది. పచ్చి కొబ్బరిలో లభించే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను నివారించడం ద్వారా జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి.

జీర్ణక్రియకు సహాయపడుతుంది

పచ్చి కొబ్బరిలోని పోషకాలు ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. ఇది కడుపు ఆరోగ్యాన్ని, ప్రేగు కదలికలను నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది.

మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్‌ చేయండి.