AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tourist Places: మీరు ప్రకృతి ప్రేమికులా.. ముంబైలోని ఈ ప్రదేశాలు బెస్ట్ ఎంపిక..

వేసవి నుంచి ఉపశమనం ఇస్తూ వర్షాలు కురుస్తున్నాయి. పుడమి పులకరించి.. ప్రకృతి పరవశిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. దీంతో వారాంతాల్లో మీరు ప్రయాణించడానికి దేశ ఆర్ధిక రాజధాని ముంబై చుట్టూ అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల సహజ సౌందర్యం మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. వర్షాకాలంలో ఈ ప్రదేశాల అందం మరింత పెరుగుతుంది.

Surya Kala
|

Updated on: Jul 29, 2023 | 12:52 PM

Share
తేమ, వేడి నుండి ఉపశమనం పొందడానికి మీరు ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకుంటే.. ముంబైకి సమీపంలో అనేక హిల్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రదేశాలలో మీరు కుటుంబం, స్నేహితులతో సంతోషంగా గడపవచ్చు. శారీరక మానసిక విశ్రాంతిని తీసుకోవచ్చు.

1 / 5
మతేరన్ సందర్శించవచ్చు. ఇది మహారాష్ట్రలోని అత్యంత అందమైన.. చిన్న హిల్ స్టేషన్లలో ఒకటి. ఇక్కడ పరిశుభ్రమైన వాతావరణం ఎవరికైనా నచ్చుతుంది. మీరు ఇక్కడ ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, జిప్-లైనింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీలలో పాల్గొనవచ్చు.

2 / 5
లోనావాలా ఇది సహజ సౌందర్యానికి చాలా ప్రసిద్ధి చెందింది. వేసవి కాలంలో ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రదేశం అందాలు చూడదగినవి. ఇక్కడ మీరు జలపాతాలు, సరస్సులు, పర్వతాలు మంత్రముగ్దులను చేసే వీక్షణలను ఆస్వాదించగలరు.

3 / 5
లావాసా పిక్నిక్  సందర్శనా స్థలాలకు మంచి ప్రదేశం. మీరు గజిబిజి లైఫ్ నుంచి ప్రశాంతంగా.. సంతోషముగా గడపాలని కోరుకుంటే లావాసాకు వెళ్లవచ్చు. ఇక్కడ స్థానిక ఆహారాన్ని రుచి చూడవచ్చు.

4 / 5
వారాంతపు సెలవుల కోసం కర్జాత్‌కి కూడా వెళ్లవచ్చు. ఇక్కడ హైకింగ్ కూడా చేయవచ్చు. చినుకులు కురుస్తున్న సమయంలో ఇక్కడ అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. పచ్చని దృశ్యాలు, జలపాతాలు, పర్వతాలు మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి.

5 / 5
Follow Us