- Telugu News Photo Gallery If you apply these face packs with banana fruit, the wrinkles and lines on the face will be reduced
Banana for Wrinkles: అరటి పండును కనుక ఇలా యూజ్ చేస్తే.. మీ ముఖంపై ముడతలు మాయం..
అరటి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి రోజూ ఒక అరటి పండు తింటే చాలా రకాల అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు. అరటి పండులో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. అరటి పండుతో కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ప్రస్తుత కాలంలో చాలా తక్కువ వయసులోనే ముఖంపై ముడతలు, లైన్స్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటిని దూరం చేసి.. మీ ముఖ అందాన్ని పెంచడంలో అరటి పండు చక్కగా పని..
Updated on: Jul 30, 2024 | 4:23 PM

అరటి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి రోజూ ఒక అరటి పండు తింటే చాలా రకాల అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు. అరటి పండులో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. అరటి పండుతో కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో చాలా తక్కువ వయసులోనే ముఖంపై ముడతలు, లైన్స్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటిని దూరం చేసి.. మీ ముఖ అందాన్ని పెంచడంలో అరటి పండు చక్కగా పని చేస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

బాగా పండిన అరటి పండును తీసుకుని మెత్తగా స్మాష్ చేయాలి. ఇందులో కొద్దిగా పెరుగు మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి.. మృదువుగా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. ఇలా వారంలో రెండు, మూడు సార్లు చేసుకుంటే ముఖంపై ఉండే ముడతలు, గీతలు పోతాయి.

అరటి పండు గుజ్జులో పాలు కూడా కలిపి ఫేస్ ప్యాక్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే ముడతలు తగ్గి.. చర్మం టైట్‌గా ఉంచేలా చేస్తుంది. మంచి గ్లో కూడా వస్తుంది. 15 నిమిషాల తర్వాత ఫేస్ శుభ్రం చేసుకోవాలి.

అరటి పండులో తేనె కలిపి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. తేనె ముఖంపై ఉండే దుమ్ము, దూళిని తొలగించి.. మృదువుగా అయ్యేలా చేస్తుంది. అరటి పండు చర్మంపై ఉండు ముడతలను తగ్గిస్తుంది. ఇలా వారంలో రెండు సార్లు ఈ ప్యాక్ అప్లై చేస్తే యంగ్ లుక్‌లో కనిపిస్తారు.




