- Telugu News Photo Gallery If these plants are in the house, mice will not stay in house, Check Here is Details
Get rid of Rats: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. ఎలుకలు అసలు ఇంట్లోకే రావు..
ఎలుకల వలన వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వీటి వలన ఇంట్లో అనేక వస్తువులు అన్నీ పాడైపోతాయి. ఎలుకలను బయటకు పంపించడానికి అనేక చిట్కాలు ట్రై చేసే ఉంటారు. కానీ కేవలం కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెట్టుకుంటే ఎలుకలు రాకుండా చేయవచ్చు..
Updated on: Dec 05, 2024 | 5:34 PM

ఇల్లు అన్నాక కీటకాల బెడద చాలా కామన్. అయితే వీటి వలన అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు. కీటకాలు వ్యాధులను వ్యాప్తి చేస్తూ ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్యానికే ప్రమాదం. ఇలా ఇంటిని పాడుచేసే వాటిల్లో ఎలుకలు కూడా ఒకటి. ఎలుకలు ఇంట్లో ఉండటం అస్సలు మంచిది కాదు.

సాధారణంగా వీటి బెడదను వదిలించుకోవడానికి అనేక రసాయనాలు, ఇంటి చిట్కాలు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచుకోవడం వల్ల కూడా ఎలుకలు ఇంట్లోకి రావు. మరి ఆ ప్లాంట్స్ ఏంటో తెలుసుకోండి.

పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. దీని నుంచి మంచి సువాసన వస్తూ ఉంటుంది. అయితే పుదీనా వాసన ఎలుకలకు పెద్దగా నచ్చదు. పుదీనా మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఆ వాసనకు ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. పుదీనా ఆయిల్ స్ప్రే చేసినా ఎలుకలు ఇంటి నుంచి పారిపోతాయి.

కృష్ణ తులసి మొక్కలు ఉన్నా కూడా ఎలుకలు ఇంట్లోకి రావు. ఎంతో మంది తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క నుంచి కూడా సువాసన వస్తూ ఉంటుంది. ఈ వాసనకు ఇంట్లోకి ఎలుకలు రాకుండా ఉంటాయి.

నీలగిరి మొక్క వలన కూడా ఇంట్లోకి ఎలుకలు రాకుండా ఉంటాయి. ఈ వాసనకు ఎలుకలకు నచ్చదు. నీలగిరి నూనెను కూడా నీటిలో కలిపి స్ప్రే చేసినా ఎలుకలు రాకుండా ఉంటాయి. అల్లం, వెల్లుల్లి మరిగించిన నీటిని స్ప్రే చేసినా కూడా ఎలుకలు రావు.




