Low Blood Pressure Diet: తక్కువ రక్తపోటు యమ డేంజర్! బీపీ పడిపోయినప్పుడు వెంటనే ఇలా చేయండి..
నేటి జీవనశైలి కారణంగా దాదాపు ప్రతి ఇంట్లో రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఉన్నారు. అధిక రక్తపోటు మాత్రమే కాదు తక్కువ రక్తపోటు కూడా ఆరోగ్యానికి హానికరం. లో బీపీ కారణంగా అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రక్తపోటును సాధారణంగా ఉంచుకోవడం చాలా అవసరం. సాధారణ రక్తపోటు 120/80. కానీ 90/60కి పడిపోయిందంటే వెంటనే వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
Updated on: Mar 15, 2024 | 9:25 PM

నేటి జీవనశైలి కారణంగా దాదాపు ప్రతి ఇంట్లో రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఉన్నారు. అధిక రక్తపోటు మాత్రమే కాదు తక్కువ రక్తపోటు కూడా ఆరోగ్యానికి హానికరం. లో బీపీ కారణంగా అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రక్తపోటును సాధారణంగా ఉంచుకోవడం చాలా అవసరం. సాధారణ రక్తపోటు 120/80. కానీ 90/60కి పడిపోయిందంటే వెంటనే వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

తక్కువ రక్తపోటు సమస్యను హైపోటెన్షన్ అంటారు. దీనివల్ల గుండె, మెదడు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి. కాబట్టి రక్తపోటు అదుపులో ఉండేందుకు, తక్కువ రక్తపోటు సమస్యలు ఉన్నవారు ఈ కింది ఆహారాలను తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం..

కాఫీ - మీరు ఎక్కువసేపు ఆహారం తినకపోతే, వెంటనే రక్తపోటు పడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాఫీ తాగాలి. ఎందుకంటే ఇందులో ఉండే కెఫిన్ రక్తపోటును సాధారణీకరిస్తుంది.

ఉప్పు - తక్కువ రక్తపోటుతో బాధపడేవారు తప్పనిసరిగా ఉప్పు తినాలి. ఉప్పు కలిపిన నీరు త్రాగవచ్చు. నిమ్మకాయ రసంలో ఉప్పు కలిపి కూడా తాగొచ్చు. అలాగే శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో బాదం సహాయపడుతుందని చాలా మందికి తెలియదు. రోజువారీ ఆహారంలో 4-5 బాదంపప్పులను చేర్చుకుంటే రక్తపోటు సక్రమంగా ఉంటుంది. బాదంపప్పును నానబెట్టి కూడా తినవచ్చు.

ఎల్లప్పుడూ పుష్కలంగా నీరు తాగాలి. శరీర నిర్జలీకరణం రక్తపోటును తగ్గిస్తుంది. సాధారణంగా రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. సరిపడా నీళ్లు తాగడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు.




