Thick Eyebrows: ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే నల్లని, ఒత్తైన కనుబొమ్మలు మీ సొంతం అవుతాయ్..
అందం ఇనుమడింప చేయడంలో కనుబొమ్మల పాత్ర ప్రత్యేకమైనది. మందపాటి, నల్లటి కనుబొమ్మలు ముఖానికి కొత్త శోభను తెచ్చి పెడతాయి. అందుకే మగువలు మందపాటి కనుబొమ్మల కోసం పలు చిట్కాలు ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మందికి కనుబొమ్మలు ఒత్తుగా పెరగవు. కనుబొమ్మలను అందంగా, ఒత్తుగా పెంచుకోవాలంటే ఈ కింది టిప్ప్ పాటించండి. నిజానికి.. కనుబొమ్మలను అందంగా తీర్చిదిద్దడంలో అదనపు సంరక్షణ అవసరం. లేకపోతే చిక్కటి, నల్లటి కనుబొమ్మల..
Updated on: Jan 29, 2024 | 11:46 AM

అందం ఇనుమడింప చేయడంలో కనుబొమ్మల పాత్ర ప్రత్యేకమైనది. మందపాటి, నల్లటి కనుబొమ్మలు ముఖానికి కొత్త శోభను తెచ్చి పెడతాయి. అందుకే మగువలు మందపాటి కనుబొమ్మల కోసం పలు చిట్కాలు ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మందికి కనుబొమ్మలు ఒత్తుగా పెరగవు. కనుబొమ్మలను అందంగా, ఒత్తుగా పెంచుకోవాలంటే ఈ కింది టిప్ప్ పాటించండి..

నిజానికి.. కనుబొమ్మలను అందంగా తీర్చిదిద్దడంలో అదనపు సంరక్షణ అవసరం. లేకపోతే చిక్కటి, నల్లటి కనుబొమ్మల ఆశ ఎప్పటికీ నెరవేరదు. కనుబొమ్మలను మందంగా పెంచాలనుకుంటే వాటిపై వెంట్రుకలను పీకడం వంటివి చేయకూడదు.

సాధారణ చర్మంలాగా కనుబొమ్మల వద్ద చర్మాన్ని కూడా ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. ఇది చర్మం ఉపరితలంపై జుట్టు త్వరగా పెరిగేలా చేస్తుంది. అలాగే బేబీ బ్రష్ సహాయంతో కనుబొమ్మలను గుండ్రంగా బ్రష్ చేయాలి. కనుబొమ్మ పెరుగుదల దిశలో వృత్తాకారంగా బ్రష్ చేయడం మర్చిపోకూడదు. అప్పుడే కనుబొమ్మలు మందంగా పెరుగుతాయి.

ఇది కాకుండా, కనుబొమ్మల పెరుగుదలను పెంచడానికి ఆలివ్ నూనె, విటమిన్ ఇ నూనె, ఆముదం వంటివి ఉపయోగించవచ్చు. ఇవి కనుబొమ్మల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోజువారీ ఆహార జాబితాలో ప్రోటీన్, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడు కనుబొమ్మలు త్వరగా దట్టంగా, నల్లగా పెరుగుతాయి.




