AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Masala Tea Benefits: ఈ మసాలా టీ ఎప్పుడైనా తాగారా? రుచికే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు భేష్‌..

శీతాకాలంలో అల్లం-ఏలకులతో చేసిన మసాలా టీ తాగితే రోజంతా అలసటగా ఉండటాన్ని దూరం చేస్తుంది. ఈ మసాలా టీని 2023 ఆల్కహాల్ లేని పానీయాల జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఇది కేవలం రుచి కోసమేనా లేదా ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. శీతాకాలం లేదా వర్షాకాలం.. సజీన్‌ ఏదైనా వేడివేడిగా ఒక కప్పు మసాలా టీ తాగితు మనసంతా ఉల్లాసంగా ఉంటుంది. ఈ మసాలా టీ రుచి పరంగా మాత్రమే కాదు..

Srilakshmi C
|

Updated on: Jan 29, 2024 | 11:23 AM

Share
శీతాకాలంలో అల్లం-ఏలకులతో చేసిన మసాలా టీ తాగితే రోజంతా అలసటగా ఉండటాన్ని దూరం చేస్తుంది. ఈ మసాలా టీని 2023 ఆల్కహాల్ లేని పానీయాల జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఇది కేవలం రుచి కోసమేనా లేదా ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. శీతాకాలం లేదా వర్షాకాలం.. సజీన్‌ ఏదైనా వేడివేడిగా ఒక కప్పు మసాలా టీ తాగితు మనసంతా ఉల్లాసంగా ఉంటుంది. ఈ మసాలా టీ రుచి పరంగా మాత్రమే కాదు.. ఈ టీలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక సుగుణాలు కూడా ఉన్నాయి. మసాలా టీని ఆరోగ్యకరమైనదిగా పిలవడం తప్పు కాదు. ఎందుకంటే ఈ టీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

1 / 5
మసాలా టీలో కాటెచిన్స్, థెఫ్లావిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. మసాలా టీ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

2 / 5
అల్లం, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలతో మసాలా టీని తయారు చేస్తుంటారు. కాబట్టి ఈ టీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కె ఉంటాయి. మసాలా టీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు, వైరస్‌ల నుంచి రక్షిస్తాయి.

3 / 5
మసాలా టీలో కెఫిన్ ఉంటుంది. ఇది పని చేయడానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అలాగే ఇది మెదడు, గుండెకు శక్తిని అందించడం ద్వారా పనితీరును మెరుగుపరుస్తుంది. మసాలా కలిపిన టీ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మసాలా టీ శరీరంలో ఆక్సిజన్, రక్త ప్రసరణను పెంచి, తద్వారా ప్రతి అవయవం పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఈ టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి.

4 / 5
మసాలా టీ తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఈ టీ జీవక్రియను పెంచడం ద్వారా అదనపు కొవ్వును దహించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మసాలా టీలోని దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మసాలా తీ ఎలా తయారు చేస్తారంటే.. ఒక దాల్చిన చెక్క ముక్క, 2-3 ఏలకులు, 2 లవంగాలు, అల్లం ముక్కను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి. 2 కప్పుల నీటిని వేడి చేయాలి. అందులో మసాలా దినుసుల ముద్దను కలపాలి. తర్వాత టీ ఆకులతో మరిగించాలి. కావాలంటే అందులో పాలు, పంచదార కలుపుకోవచ్చు. అంతే మసాలా టీ రెడీ అయినట్లే.

5 / 5