AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lizard Control: అరెరే బల్లులను తరిమికొట్టడం ఇంత సింపులా.. ఇది తెలీక ఇన్నాళ్లు తెగ కష్టపడ్డామే..

ప్రతి ఇంట్లో సాధారణంగా ఉండే సమస్యల్లో బల్లులు కూడా ఒకటి.. చాలా మంది ఇంట్లో కనిపించే బల్లుల చూసి భయపడుతూ ఉంటారు. వీటిని ఇంట్లోకి రాకుండే చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అవి మాత్రం అస్సలూ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే తిష్టవేస్తాయి. కానీ ఇప్పుడు ఈ కొన్ని చిట్కాలు పాటిస్తే మాత్రం.. క్షణాల్లో బల్లులు ఇంట్లోని పరుగులు తీస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

Anand T
|

Updated on: Nov 06, 2026 | 5:40 PM

Share
ఇంట్లో బల్లులు ఉన్నాయా.. వాటిని ఎంత తరిమినా ఇంట్లో నుంచి పోవట్లేదా.. టెన్షనొద్దు.. బల్లులు మీ ఇంట్లోకి అస్సలు రాకుండా తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు ఇక్కడున్నాయి. ఇందు కోసం మీరు ఎక్కువగా డబ్బులు కూడా పెట్టాల్సిన పనిలేదు.. కేవలం మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే వాటిని తరిమేయవచ్చు.

1 / 5
ఇందుకోసం ముందుగా ఒక చిన్న గుడ్డ ముక్క తీసుకోండి. అందులో 3 నుంచి 4 కర్పూరం బిళ్ళలను ఉంచి, మెత్తగా పొడి చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 మూత డెట్టాల్ లిక్విడ్ తీసుకుని, అందులో ఈ కర్పూరం పొడిని కలపండి. తర్వాత అందులో 3 నుంచి 4 మూతల నీళ్లు పోసి మిశ్రమాన్ని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకోండి.

2 / 5
దాన్ని.. బల్లులు ఎక్కువగా తిరిగే లేదా ఇంట్లోకి వచ్చే ప్రదేశాలలో ఈ లిక్విడ్‌ను స్ప్రే చేయండి. ముఖ్యంగా కిటికీ అంచులు, తలుపుల వెనుక, ముందు భాగాలు, కర్టెన్ల వెనుక, గోడలపై పైభాగంలో, అల్మారాల మూలల్లో దీనిని స్ప్రే చేయవచ్చు.కర్పూరం, డెట్టాల్ వాసన బల్లులకు అస్సలు పడదు. దాంతో అవి ఆ వాసన ఉన్న చోట ఉండలేక పారిపోతాయి. కొన్ని రోజులకు వాసన తగ్గిపోతే బల్లులు మళ్లీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ప్రతి 2 రోజులకు ఒకసారి గోడలపై ఈ స్ప్రేని చల్లుతుండండి. బల్లులను ఇంట్లోంచి తరిమికొట్టడానికి ఇది చాలా తేలికైన మార్గం.

3 / 5
బల్లులను తరిమే మరో చిట్కా ఏమిటంటే ఉల్లిపాయ - కారప్పొడి స్ప్రే.. ఇందుకోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి. అందులో కొన్ని కర్పూరం ముక్కలు, కొద్దిగా ఎర్ర కారప్పొడి, సగం తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా మరిగించండి. నీటి రంగు మారే వరకు మరిగించిన తర్వాత, చల్లార్చి వడకట్టి ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకోండి. దీనిని గోడలపై, మూలల్లో స్ప్రే చేయండి.

4 / 5
ఈ స్ప్రే చల్లేటప్పుడు కళ్లకు తగలకుండా జాగ్రత్త వహించండి. ఇందులో కారం ఉండటం వల్ల కళ్లలో పడితే తీవ్ర మంట వస్తుంది. కాబట్టి ఈ స్ప్రేను పిల్లలకు అందకుండా దూరంగా ఉంచండి. ఇంట్లో పిల్లలు లేదా మీ చేతులు తగలకుండా ఉండేందుకు, గోడలపై ఎత్తుగా ఉండే భాగాల్లో మాత్రమే దీనిని స్ప్రే చేయడం మంచిది. ఈ లిక్విడ్‌ను తయారుచేసి నిల్వ ఉంచుకోవచ్చు. కొద్ది రోజుల వ్యవధిలో అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉంటే సరిపోతుంది.

5 / 5
Follow Us