Diwali 2026: దీపావళి నాడు ఏ రాశి వారు ఏ దేవతను పూజించాలి? ఇంట సిరుల వర్షమే!
దీపావళి పర్వదినాన లక్ష్మీదేవి పూజతో పాటు తమ రాశులకు అధిపతులైన గ్రహాలకు సంబంధించిన దేవతలను ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారు ఏ దేవతను పూజించాలి? సుబ్రహ్మణ్యస్వామి, దుర్గాదేవి, గణపతి, నరసింహస్వామి, శివుడు, సూర్యభగవానుడిని ఏ రాశుల వారు ఆరాధించాలో తెలుసుకుందాం.

దీపావళి సమయంలో వివిధ రాశుల వారు లక్ష్మీదేవితో పాటు ఇతర దేవతలను కూడా పూజించడం వల్ల గ్రహాల అనుకూలత బాగా పెరుగుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. కుజుడు అధిపతిగా ఉన్న మేష, వృశ్చిక రాశుల వారు సుబ్రహ్మణ్యస్వామిని, శుక్రుడు అధిపతిగా ఉన్న వృషభ, తులా రాశుల వారు దుర్గాదేవిని, బుధుడు అధిపతిగా ఉన్న మిథున, కన్యా రాశులవారు గణపతిని, గురువు అధిపతిగా ఉన్న ధనుస్సు, మీన రాశులవారు నరసింహ స్వామిని, శని అధిపతిగా ఉన్న మకర, కుంభ రాశుల వారు శివుడిని, రవి, చంద్రులు అధిపతులుగా ఉన్న సింహ, కర్కాటక రాశులవారు సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి.
మేషం, వృశ్చికం
కుజుడు అధిపతిగా ఉన్న ఈ రాశుల వారు దీపావళి తర్వాత అత్యంత సంపన్నులు కావడానికి బాగా అవకాశం ఉంది. వీరు దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు కుమారస్వామిని కూడా పూజించడం, స్కంద స్తోత్రం పఠించడం వల్ల అదనపు ఆదాయ ప్రయత్నాలతో పాటు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు కూడా తప్పకుండా సఫలమవుతాయి. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో హోదాలు, జీతభత్యాలు బాగా పెరుగుతాయి.
వృషభం, తుల
ఈ రాశులకు శుక్రుడు అధిపతి అయినందువల్ల ఈ రాశులవారు దుర్గాదేవిని పూజించడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడంతో పాటు సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పోటీదార్లు, ప్రత్యర్థుల మీద విజయాలు సాధిస్తారు. ఆరోగ్య భాగ్యం కలుగు తుంది.
మిథునం, కన్య
ఈ రాశులకు బుధుడు అయినందువల్ల ఈ రాశులవారు దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా ఆరాధించడం మంచిది. దీనివల్ల ఎటువంటి ఆటంకాలూ, అవరోధాలూ లేకుండా ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఉన్నత స్థాయి పరిచ యాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి.
కర్కాటకం, సింహం
చంద్ర, రవులు అధిపతులుగా ఉన్న ఈ రాశుల వారు సూర్య భగవానుడిని ఆరాధించడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. వీరు లక్ష్మీదేవితో పాటు సూర్యుడిని ఆరాధించడం అనేక విధాలుగా మేలు కలుగుతుంది. త్వరలో దశ తిరిగి, ఆదాయ వృద్ధితో పాటు వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కవడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది.
ధనుస్సు, మీనం
ఈ రాశులకు గురువు అధిపతి అయినందువల్ల ఈ రాశులవారికి దీపావళి తర్వాత ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గడం ఉండదు. లక్ష్మీదేవితో పాటు నరసింహస్వామిని లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మనసులోని కోరికలు కొన్ని నెరవేరడమే కాక, జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.
మకరం, కుంభం
శనీశ్వరుడు అధిపతిగా ఉన్న ఈ రాశుల వారు దీపావళి రోజున శివార్చన లేదా అభిషేకం చేయించడం వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పొందు తారు. రాజపూజ్యాలు లభిస్తాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయాలు సాధిస్తాయి. విదేశీ ప్రయత్నాలకు ఆటంకాలు తొలగిపోతాయి.



