AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి తర్వాత వీరికి అరుదైన మహా భాగ్య యోగం! ఆకస్మిక ధనప్రాప్తి

దీపావళి తర్వాత.. అంటే నవంబర్ 9, 10, 11 తేదీల్లో చంద్రుడు, కుజుడి మధ్య అరుదైన పరివర్తన యోగం ఏర్పడనుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం దీనిని మహాభాగ్య యోగంగా పరిగణిస్తున్నారు. ఈ మూడు రోజుల పాటు ఆరు రాశుల వారికి ఆదాయ వృద్ధి, ఆకస్మిక ధనలాభం, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ యోగ సమయంలో కీలకమైన ప్రయత్నాలు చేపడితే అనుకూల ఫలితాలు పొందవచ్చని భావిస్తున్నారు.

దీపావళి తర్వాత వీరికి అరుదైన మహా భాగ్య యోగం! ఆకస్మిక ధనప్రాప్తి
Chandra Mangal Parivartana Yoga 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 06, 2026 | 3:54 PM

Share

దీపావళి తర్వాత.. అంటే ఈ నెల(నవంబర్) 9, 10, 11 తేదీల్లో చంద్ర, కుజుల మధ్య మరోసారి పరివర్తన జరుగుతోంది. కుజుడికి చెందిన వృశ్చిక రాశిలో చంద్రుడు, చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో కుజుడు సంచారం చేస్తున్నందు వల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. ఈ రెండు గ్రహాలు నీచ స్థితిలోనే ఉన్నందువల్ల ఈ యోగం విశిష్టత సంతరించుకుంది. ఈ రెండు గ్రహాల మధ్య పరివర్తన జరగడాన్ని మహా భాగ్య యోగమని అంటారు. దీనివల్ల వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయ వృద్ధి, ఆకస్మిక ధన ప్రాప్తి, ఇతరత్రా ధన లాభాలు కలగబోతున్నాయి. ఈ మూడు రోజుల యోగ కాలంలో ముఖ్యమైన ప్రయత్నాలు చేపట్టడం మంచిది.

  1. వృషభం: ఈ రాశికి తృతీయ, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల కొద్ది ప్రయత్నంతో సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం లభి స్తుంది. ఉద్యోగంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశిలో ఉన్న కుజుడితో రాశ్యధిపతి చంద్రుడికి పరివర్తన జరగడం వల్ల అనేక మార్గాల్లో సంపద వృద్ధి చెందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. ఆదాయ వృద్ది కోసం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు వరిస్తాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభంచి జీతభత్యాలు పెరగడం, పదోన్నతి లభించడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి, రాబడి అధికమవుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
  3. తుల: ఈ రాశికి ధన, దశమాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు భారీ జీత భత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తి సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  4. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడితో భాగ్యాధిపతి చంద్రుడికి పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారు ఆదాయ పరంగా అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ఆదాయ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ధన ధాన్య సమృద్ధికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.
  5. మకరం: ఈ రాశికి సప్తమ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో అనుకోకుండా పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. అనుకోకుండా ఆస్తులు కలిసిరావడం, వారసత్వ సంపద లభించడం జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది.
  6. మీనం: ఈ రాశికి పంచమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. రావలసిన డబ్బు వసూలవుతుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై భూలాభం కలుగుతుంది.

Follow Us