చలికాలంలో గులాబీలు గుత్తులు గుత్తులుగా పూయాలా?

samatha

6 November 2026

Pic credit - Pinterest

చలికాలంలో వాతావరణం తేమగా ఉండటంతో చాలా పూల మొక్కలు చెట్టు నిండుగా పూలు పూస్తుంటాయి.

వాతావరణం

అయితే ఈ సమయంలో గులాబీ పువ్వులు ఎక్కువగా పూయదు. కానీ చలికాలంలో గుత్తులు గుత్తులుగా గులాబీ మొక్క పూలు పూయాలంటే ఏం చేయాలో తెలుసా?

గుత్తులుగా పూయడం

ముందు కత్తిరింపులు చేపట్టాలి. గులాబీ మొక్క కొమ్మలను, ఎండి పోయిన కొమ్మలను కత్తిరింపులు చేపట్టాలి.

కత్తిరింపులు

దీని వలన మొక్క వేపుగా పెరుగుతుంది. అంతే కాకుండా ఎక్కువ మొగ్గలు వేసి, చెట్టు నిండుగా పూలు పూస్తుంది.

వేపుగా పెరగడం

అలాగే ప్రతి రోజూ కనీసం ఆరు గంటల ఎండ దీనికి తప్పనిసరి. మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలి అంటే, ఎండ ఉండేలా చేసుకోవాలి.

సూర్య రశ్మి తప్పనిసరి

అలాగే గులాబీ మొక్కకు ఎరువులు కూడా వేయాలి. ప్రతి రోజూ అరటి పండు నీరు పోయాలి. ఇది మొక్కను బలంగా ఉంచుతుంది.

ఎరువు

అదే విధంగా ఈ నీరు పోయడం వలన  మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి. అలాగే చెట్టు నిండుగా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తుంది.

నీరు పోయడం

గుడ్డు పెంకులను ఎండబెట్టి పొడి చేసి మొక్కకు వేస్తే, కాల్షియం అందుతుంది. పువ్వులు రాలిపోకుండా, గట్టిగా ఉంటాయి

గుడ్డు పెంకుల పొడి