AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : ప్రభాస్ నా క్లాస్ మేట్.. సినిమాల్లోకి రాకముందే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ నటుడు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ హీరోతో తనకున్న అనుబంధం గురించి టాలీవుడ్ నటుడు ఆసక్తికకర విషయాలు పంచుకున్నారు. సత్యానంద్ గారి ఇన్‌స్టిట్యూట్‌లో ప్రభాస్‌తో కలిసి ఒకే బ్యాచ్‌లో శిక్షణ పొందిన విధానాన్ని వెల్లడించారు.

Prabhas : ప్రభాస్ నా క్లాస్ మేట్.. సినిమాల్లోకి రాకముందే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ నటుడు..
Prabhas Sreenu
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2026 | 5:08 PM

Share

తెలుగు సినీ నటుడు ప్రభాస్ శ్రీను తన పేరుకు ప్రభాస్ అనే పేరును జోడించుకోవడం ద్వారా ప్రజలకు సుపరిచితులు అయ్యారు. ఇది ఆయనకు నటుడు ప్రభాస్‌తో ఉన్న గాఢమైన స్నేహబంధానికి ప్రతీక. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సిరీస్‌లో ప్రభాస్ శ్రీను, ప్రభాస్‌తో తన ప్రయాణం ఎలా మొదలైంది, వారిద్దరూ ఎలా కలుసుకున్నారు అనే విషయాలను ఆసక్తికరంగా పంచుకున్నారు. తన విద్యాభ్యాసం పట్ల తనకు పెద్దగా ఆసక్తి లేదని ప్రభాస్ శ్రీను అన్నారు. తాను చదువు పట్ల పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో, తన తండ్రి మధు ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చినట్లు తెలిపారు. అక్కడ తాను కల్చరల్ యాక్టివిటీస్‌లో చురుకుగా పాల్గొన్నట్లు వివరించారు. ఈ సమయంలోనే తనకు కృష్ణానగర్ కష్టాలు లేవని, దేవుడి దయవల్ల అటువంటి పరిస్థితి రాలేదని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

మధు ఇన్‌స్టిట్యూట్ తర్వాత, సినీ అవకాశాల కోసం ప్రభాస్ శ్రీను తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, ఎక్కడా అవకాశాలు రాకపోవడంతో నిరాశ చెందారు. అప్పుడు ఆయన తండ్రి, వైజాగ్‌లో ఆర్డీఓగా పనిచేసేవారు, సత్యానంద్ గారి ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకు సహాయం చేశారు. సత్యానంద్ గారు అందరికీ శిక్షణ ఇవ్వరని, సెలబ్రిటీల పిల్లలకే ఎక్కువగా అవకాశం ఇస్తారని తెలిసినప్పటికీ, తన తండ్రి విజ్ఞప్తితో శ్రీనుకు ప్రవేశం లభించింది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లోనే ప్రభాస్ శ్రీను జీవితంలో కీలక మలుపు తిరిగింది. సత్యానంద్ గారి బ్యాచ్‌లో ప్రభాస్ శ్రీను, ప్రభాస్ ఒకే బ్యాచ్‌మేట్‌లుగా కలిశారు. ప్రభాస్ ఒక సినిమా కోసం క్రాష్ కోర్సు చేయడానికి వచ్చారని, 20 రోజుల్లో శిక్షణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని శ్రీను గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

ఆ బ్యాచ్‌లో శరాఫత్, కుమార్ (ప్రిన్సిపాల్), రాజశ్రీధర్ వంటి వారు కూడా ఉన్నారని తెలిపారు. ఇక్కడే ప్రభాస్, ప్రభాస్ శ్రీనుల స్నేహ ప్రయాణం మొదలైంది. ఈ పరిచయం ద్వారానే ప్రభాస్ శ్రీను, ప్రభాస్ పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ప్రభాస్ ఒక నటుడిగా స్థిరపడిన తర్వాత, శ్రీను కొంతకాలం ఆయన పనులను చూసుకున్నారు. ప్రభాస్ సంవత్సరానికి ఒక సినిమాకే పరిమితమైన తర్వాత, ప్రభాస్ మామయ్యలు ఆ బాధ్యతలు చేపట్టగా, ప్రభాస్ శ్రీను పూర్తిస్థాయి నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. తనదైన నటనతో కామెడీ, విలన్ పాత్రల్లో రాణిస్తూ తెలుగు సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

ప్రభాస్ శీను..

Prabhas Sreenu News

Prabhas Sreenu News

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us