AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరేంద్ర మోదీ ముందే పాట పాడిన బుజ్జాయి.. ముగ్ధుడైన ప్రధాని ఏం చేశారంటే?

దీపావళి పండుగ వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ చిన్నారి తన ముద్దుముద్దు పాటతో ఆనందాన్ని పంచింది. ఆమె పాటకు ప్రధాని మోదీ ఫిదా అయ్యారు. చిన్నారిని ప్రత్యేకంగా అభినందించి ఆశీర్వదించారు. భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కుటుంబంతో ప్రధాని మోదీ జరిపిన భేటీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

నరేంద్ర మోదీ ముందే పాట పాడిన బుజ్జాయి.. ముగ్ధుడైన ప్రధాని ఏం చేశారంటే?
Pm Modi Impressed
Balaraju Goud
|

Updated on: Nov 06, 2026 | 5:21 PM

Share

దీపావళి పండుగ వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ చిన్నారి తన ముద్దుముద్దు పాటతో ఆనందాన్ని పంచింది. ఆమె పాటకు ప్రధాని మోదీ ఫిదా అయ్యారు. చిన్నారిని ప్రత్యేకంగా అభినందించి ఆశీర్వదించారు. భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కుటుంబంతో ప్రధాని మోదీ జరిపిన భేటీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

శుక్రవారం (నవంబర్ 06) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని భారత టీ20 క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కలిశారు. ఈ సందర్భంగా మోదీ సూర్యకుమార్ కుటుంబంతో కొంతసేపు సరదాగా గడిపారు. ముఖ్యంగా పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ క్రమంలో సూర్యకుమార్ కుటుంబానికి చెందిన ఓ చిన్నారి ప్రధానమంత్రి ముందు చక్కగా పాట పాడింది. చిన్నారి ప్రదర్శనను ఆసక్తిగా విన్న మోదీ ఆమెను మెచ్చుకుని ఆశీర్వదించారు.

ఈ భేటీకి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. శ్రీరాముడి రాక, సరయూ నది రాకతో ఈ ఏడాది దీపావళి వేడుకల వాతావరణం మరింత పవిత్రంగా, దైవికంగా మారిందని ఆయన పేర్కొన్నారు. పండుగ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ కుటుంబాన్ని కలవడం ఆనందంగా ఉందని తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ భేటీలో మరో ఆసక్తికరమైన అంశం కూడా కనిపించింది. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సాధించిన విజయానికి గుర్తుగా సూర్యకుమార్ గెలుచుకున్న బంగారు పతకాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ఆ పతకాన్ని చేతిలోకి తీసుకున్న ఆయన, భారత క్రికెట్ జట్టు సాధించిన చారిత్రాత్మక విజయం గురించి సూర్యకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.

ఇదిలావుంటే, ఇటీవల సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్‌పై చర్చ జరుగుతోంది. గతంలో మాదిరిగా పరుగులు సాధించలేకపోవడంతో ఆయన జట్టులో తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశీయ క్రికెట్‌లో ఆడుతూ ఫామ్‌ను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టారు. మొత్తానికి సూర్యకుమార్ కుటుంబంతో ప్రధాని మోదీ భేటీ, ముఖ్యంగా చిన్నారి పాటకు ఆయన స్పందించిన తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. క్రికెట్, కుటుంబ అనుబంధం, పండుగ సంబరాలు కలిసిన ఈ మధురమైన క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us