Menopause: మెనోపాజ్ సమస్యను ఎదుర్కోవడం ఎలా.? కొన్ని చిట్కాలతో ఉపశమనం..
వయసు పెరిగేకొద్దీ మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. వాటిలో ఒకటే మెనోపాజ్. రుతుక్రమం పూర్తిగా ఆగిపోయే దశ ఇది. అయితే ఇది యాభై ఏళ్లు దాటిన మహిళల్లో మాత్రమే కనిపించేదే. కానీ మారుతున్న జీవనశైలి కారణంగా నలభైలలోనే స్త్రీలలో ఈ సమస్య కనిపిస్తుంది. అయితే చాలామందికి మెనోపాజ్ ఇబ్బందుల పట్ల అవగాహన లేని కారణంగా సమస్య తీవ్రం అవుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగే చిట్కాలు ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Jul 16, 2025 | 6:11 PM

స్త్రీలు మెనోపాజ్ తర్వాత ఆరోగ్యంపై జాగ్రత్తగా వహించకపోతే గుండెపోటు వచ్చే ఆస్కారం ఉన్నట్టు అధ్యయనాలు తెలిపాయి. ఈ సమస్య ఉన్న మహిళను వ్యాయామం చేయడంతో పాటు పోషకాహారం తీసుకోవడం కూడా తప్పనిసరి.

మెనోపాజ్ దశలో పొత్తికడుపు ముందుకు రావడం కారణంగా బరువు పెరగడం కూడా ప్రారంభం అవుతుంది. దీన్ని మొదట్లోనే నియంత్రించాలని అంటున్నారు నిపుణులు. దీని కోసం రోజూ వాకింగ్ వంటివి చేస్తూ ఉండాలి.

మెనోపాజ్ దశలో మానసిక ఆందోళన, ఒత్తిడి ఎక్కువ అవుతాయి. దీని కారణం ఆ సమయంలో హార్మోన్ల అసమతుల్యత ఉండటం. అయితే ఈ సమస్య ఒక్కో మహిళలో ఒక్కోలా ఉంటుంది. ఇది నివారించడానికి సరైన సమయంలో మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యం.

మెనోపాజ్ తర్వాత కాలం, వాతావరణంతో సంబంధం లేకుండా స్త్రీ చర్మం పొడిబారుతుంది. తలపై మాడు కూడా పొడిబారిపోయి దురదకు దారితీస్తుంది. కాబట్టి, ప్రతిరోజూ మీరు నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను వాడాలి.

ముఖ్యంగా మెనోపాజ్ దశలో మహిళల ఎముకలు బలహీనపడతాయి. అలాగే నిద్రలేమి సమస్య కూడా ఈ దశలో కనిపిస్తుంది. వీటి నుంచి ఉపశమనం కోసం పాలు లాంటి క్యాల్షియంతో కూడిన ఆహారం తీసుకోవడం మంచిది.




