అందుకే టెర్రస్ గార్డెన్ అనే కల్చర్ ఈమధ్య చాలా ఎక్కువ అయిపోయింది. ఒకప్పుడు టెర్రస్ గార్డెన్ అంటే సంపన్నులు, పెద్దపెద్ద బంగళాలు ఉన్నవాళ్లు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు దీనిపై ప్రచారం బాగా పెరగటం దాంతోపాటు సులభం, తక్కువ ఖర్చు, మనకు కావలసిన కూరగాయలు మనమే సొంతంగా పండించుకోవడం, అన్నింటికీ మించి ఎటువంటి కల్తీ లేని కూరగాయలు తింటున్నామని తృప్తి వల్ల ఇప్పుడు ఇది చాలా విస్తృతంగా పెరిగింది.