కొలెస్ట్రాల్.. పెను ప్రమాదకరంగా మారుతోంది.. ఇది ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తోంది.. అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతక గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదానికి దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా.. అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.. ముఖ్యంగా శరీరంలో కొవ్వును నియంత్రించేందుకు మంచి జీవనశైలిని.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. కొలెస్ట్రాల్ అనేది కణ త్వచాలలో కనిపించే కొవ్వు, జిడ్డుగల స్టెరాయిడ్... ఇది రక్త సిరల్లో ఫలకం పేరుకునేలా చేసి.. రక్తం సరఫరాకు అడ్డంకిగా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగి అధిక రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు మరింత కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు వాస్తవానికి కొలెస్ట్రాల్ రెండు రకాలు.. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) - మంచి కొలెస్ట్రాల్, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) చెడు కొలెస్ట్రాల్ గా పరిగణిస్తారు..