చిన్న గ్యాప్ అంతే.! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండబోత వర్షం.. నాలుగు రోజులు దంచికొట్టుడే..
తెలంగాణాను మళ్లీ చిత్తడి చేస్తోంది భారీవర్షం. నిన్నటినుంచి కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. మొత్తం 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ఏఏ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఉందో, ఏ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఉందో ఒకసారి చూద్దాం.
Updated on: Sep 06, 2023 | 8:59 PM

చిన్న గ్యాప్ ఇచ్చా... మళ్లీ వచ్చేశా అంటూ దడ పుట్టిస్తోంది కుండపోత. తెలుగు రాష్ట్రాల్ని తడిపి ముద్ద చేస్తోంది భారీవర్షం. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణశాఖ.

తెలంగాణాను మళ్లీ చిత్తడి చేస్తోంది భారీవర్షం. నిన్నటినుంచి కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. మొత్తం 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ఏఏ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఉందో, ఏ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఉందో ఒకసారి చూద్దాం.

జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, భూపాలపల్లి, కరీంనగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇవ్వగా.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, గద్వాల, మల్కాజ్‌గిరి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇక నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు గ్రీన్ అలర్ట్ ఇచ్చారు.

భాగ్యనగరంలో అయితే భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ టెర్రర్ కనిపిస్తోంది. లక్డికపుల్, మసబ్ ట్యాంక్, మియపూర్ క్రాస్ రోడ్డు లాంటి థిక్కెస్ట్ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర నిలిపోయాయి వాహనాలు.

అటు ఏపీలో కూడా భారీ వర్షసూచన కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు కుండపోత ఖాయం అంటోంది విశాఖ వాతావరణ కేంద్రం. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఐంది. తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు వెళ్లాయి.