- Telugu News Photo Gallery Healthy Cooking Oil: best cooking oils for Indian food and the right way to use them
Healthy Cooking Oil: ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వంట నూనెలు వాడండి.. కొలెస్ట్రాల్ కూడా పెరగదు!
వంటనూనె లేకుండా దాదాపు ఏ వంట చేయలేం. పోపు పెట్టడానికి, వేయించడానికి వంటలలో ఖచ్చితంగా నూనె అవసరం అవుతుంది. కానీ ఎక్కువ నూనె వినియోగం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే వంటల్లో నూనె పరిమాణాన్ని చూడటమే కాకుండా, నూనె నాణ్యతను కూడా జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు నిపుణులు. చాలా మంది గృహిణులు వంటలలో నూనెను ఉపయోగించడంపై పెద్దగా శ్రద్ధ చూపరు. నిజానికి, వంటకు ఏ నూనె మంచిదో తెలుసా?..
Updated on: Jun 30, 2024 | 8:51 PM

వంటనూనె లేకుండా దాదాపు ఏ వంట చేయలేం. పోపు పెట్టడానికి, వేయించడానికి వంటలలో ఖచ్చితంగా నూనె అవసరం అవుతుంది. కానీ ఎక్కువ నూనె వినియోగం ఆరోగ్యానికి మంచిది కాదు.

అయితే వంటల్లో నూనె పరిమాణాన్ని చూడటమే కాకుండా, నూనె నాణ్యతను కూడా జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు నిపుణులు. చాలా మంది గృహిణులు వంటలలో నూనెను ఉపయోగించడంపై పెద్దగా శ్రద్ధ చూపరు. నిజానికి, వంటకు ఏ నూనె మంచిదో తెలుసా?

ఆవాల నూనె వంటలో ఉపయోగించవచ్చు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్‌లు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే నెయ్యి చాలా కాలంగా భారతీయ వంటలలో ఉపయోగిస్తున్నారు. నెయ్యిలో కరిగే ఫైబర్, విటమిన్లు ఎ, డి, ఇ, కె ఉన్నాయి. నెయ్యి ఆరోగ్యానికి, చర్మానికి కూడా మంచిది. గుండెకు కూడా మేలు చేస్తుంది. అయితే పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

బాదం నూనెను కూడా వంటల్లో ఉపయోగించవచ్చు. తెల్ల నూనె కంటే బాదం నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నూనెను చిరుతిళ్లు వేయించడానికి ఉపయోగించవచ్చు. అలాగే కొబ్బరి నూనెతో చేసిన వంటలను కూడా తినవచ్చు. ఈ నూనెను దక్షిణాదిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా కొబ్బరినూనెతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు.

పప్పులు, కూరలు వండేటప్పుడు నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో వేయించిన ఆహారం, కూరలను తినొచ్చు. అలాగే ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఆలివ్ నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.




