- Telugu News Photo Gallery Ayurvedic Remedy: With These 5 Ayurvedic Items Boost Your Immune System Naturally in monsoon
Immunity Boost Tips: వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు రాకూడదంటే రోజూ కాసిన్ని నీళ్లలో తులసి ఆకులు వేసి..
వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు దాడి చేస్తాయి. అయితే క్రమం తప్పకుండా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఫలితంగా వర్షాకాలంలో కూడా జలుబు, దగ్గు మీరు సులభంగా అధిగమించగలరు. ముఖ్యంగా ఆయుర్వేదంలో వినియోగించే ఈ 5 రకాల పదార్ధాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి..
Updated on: Jun 30, 2024 | 9:04 PM

వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు దాడి చేస్తాయి. అయితే క్రమం తప్పకుండా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఫలితంగా వర్షాకాలంలో కూడా జలుబు, దగ్గు మీరు సులభంగా అధిగమించగలరు. ముఖ్యంగా ఆయుర్వేదంలో వినియోగించే ఈ 5 రకాల పదార్ధాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి.

తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి. ఈ ఆకును తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీని వల్ల జలుబు, దగ్గు అంత తేలికగా దరిచేరవు.

వేప ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వేప ఆకులను కూడా తీసుకోవాలి. రుచి చేదుగా ఉన్నా, దీనిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

అశ్వగంధను ఆయుర్వేద వైద్యంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అశ్వగంధ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో సహా మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

అలాగే ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఉసిరికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగ్గా ఉంటుంది. అల్లం వంటలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అల్లం టీ తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వర్షాకాలంలో కూడా జలుబు మిమ్మల్ని సులభంగా అధిగమించదు.




